బి.ఎస్.ఎఫ్. అధికారి, భార్య ‘విదేశీయులే’: అస్సాం ట్రిబ్యునల్ నిర్ధారణ

admin
1 0

అస్సాం ఫారెనర్స్ ట్రిబ్యునళ్ల గుడ్డి తీర్పులకు మరో ఉదాహరణ ఇది. బి.ఎస్.ఎఫ్. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ముజిబుర్ రెహ్మాన్, ఆయన భార్య విదేశీయులని తేల్చింది ఆ రాష్ట్రంలోని జోర్హాట్ పట్టణంలోని ట్రిబ్యునల్. రెహ్మాన్ ప్రస్తుతం బిఎస్ఎఫ్ లో పంజాబ్ రాష్ట్రంలో పని చేస్తున్నారు. జూలై చివరి వారంలో ఆయన సెలవుపై అస్సాం వచ్చినప్పుడు ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయారు.

1923 నుంచి భూమి డాక్యుమెంట్లు ఉన్న తనలాంటి ఒక నిజమైన భారతీయుడిని ఓ తాగుబోతు సాక్ష్యం ఆధారంగా విదేశీయుడిగా ప్రకటించడం దారుణమని రెహ్మాన్ ఆవేదన వ్యక్తం చేశారు. అస్సాం పోలీసు శాఖలోని సరిహద్దు విభాగం ట్రిబ్యునల్ కు సమర్పించిన నివేదికకు ఓ తాగుబోతు వాంగ్మూలమే ఆధారమని రెహ్మాన్ చెబుతున్నారు. ఈ సరిహద్దు విభాగం ప్రధానంగా పాకిస్తాన్ నుంచి చొరబాట్లను నిరోధించడానికి 1962లో ఏర్పాటైంది. ఈ విభాగం ఆధారంగా అస్సాంలోని ‘‘విదేశీయుల’’ను నిర్ధారించడానికి 100 ట్రిబ్యునళ్ళ పని చేస్తున్నాయి.

ముజిబుర్ రెహ్మాన్, ఆయన భార్య విదేశీయులన్న పోలీసులు, ట్రిబ్యునళ్లకు.. ఆయన సోదరులు, తల్లిదండ్రుల పౌరసత్వంపై మాత్రం ఎలాంటి సందేహాలూ లేవట! అస్సాం, నాగాలాండ్ సరిహద్దులోని ఉదయ్ పూర్ - మికిర్ పట్టి ప్రాంతంలో వారి కుటుంబం నివాసం ఉంటోంది. తన పౌరసత్వంపై ట్రిబ్యునల్ నుంచి ఎటాంటి నోటీసూ రాలేదని, తమ గ్రామ పెద్ద కూడా తమకు సమాచారం ఇవ్వలేదని రెహ్మాన్ చెప్పారు. ఈ విషయంపై తాను గౌహతి హైకోర్టును ఆశ్రయించినట్టు వెల్లడించారు.  

Next Post

కేంద్రం, రాష్ట్రాలకు ప్రజలు చెల్లిస్తున్న పన్నుల మొత్తం రూ. 35 లక్షల కోట్లు

అస్సాం ఫారెనర్స్ ట్రిబ్యునళ్ల గుడ్డి తీర్పులకు మరో ఉదాహరణ ఇది. బి.ఎస్.ఎఫ్. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ముజిబుర్ రెహ్మాన్, ఆయన […]
error

Enjoy this blog? Please spread the word