‘పార్లే’ నుంచి 10,000 ఉద్యోగాలు పోతున్నాయ్!

admin

ఇండియాలో బిస్కట్ తయారీదారుల్లో దిగ్గజం పార్లే ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడా కంపెనీ బిస్కట్ల అమ్మకాలు తగ్గిపోవడంతో ఏకంగా 10 వేల మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్టు ఓ అధికారి బుధవారం చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పడిపోవడంతో ఉత్పత్తిని తగ్గించినట్టు ఆయన చెప్పారు.ఆసియాలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన ఇండియాలో ఇప్పుడు పలు రంగాలు తిరోగమనంలో ఉన్నాయి. కార్ల నుంచి దుస్తులవరకు అమ్మకాలు పడిపోయాయి. కంపెనీలు ఉత్పత్తి […]

మోటారు పరిశ్రమ సంక్షోభం: 1,500 మందిని తొలగించిన ఎం&ఎం

admin

దేశంలో మోటారు పరిశ్రమ సంక్షోభంలో పడింది. గత 19 సంవత్సరాల్లో చూడని విధంగా జూలైలో అమ్మకాలు ఏకంగా 18.71 శాతం తగ్గాయి. గత రెండు, మూడు నెలల్లో 15 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారని అంచనా. ఈ నేపథ్యంలో… భారత మోటారు పరిశ్రమలో దిగ్గజ సంస్థ మహింద్రా & మహింద్రా తాత్కాలిక ఉద్యోగులను ఇంటికి పంపుతోంది. ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా తమ కంపెనీ 1,500 మంది తాత్కాలిక ఉద్యోగులను తొలగించినట్టు […]

‘5 ట్రిలియన్లు’ కలేనా..?! జీడీపీ ర్యాంకుల్లో 7వ స్థానానికి జారిన ఇండియా

admin

2024 నాటికి ఇండియా 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా పరిణతి చెందుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి బీజేపీ గల్లీ నేతల వరకు ఊరూరా చెబుతున్నారు. రెండోసారి గెలిచాక మోదీ తన ప్రధాన లక్ష్యం ఇదే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అయితే, ఈ లక్ష్యాన్ని సాధించే పరిస్థితులున్నాయా? అన్న ప్రశ్నకు సంతృప్తికర సమాధానలకంటే సందేహాలే ఎక్కువగా వినవస్తున్నాయి. 2025 నాటికి ఇండియా 5 ట్రిలియన్ డాలర్ల (రూపాయల్లో 350 లక్షల కోట్ల) […]

7.1 కాదు.. 8.2 శాతం..! పెద్ద నోట్లు రద్దయిన ఏడాది జీడీపీ బాగా పెరిగిందట!!

admin

‘‘సవరించిన డేటా’’ను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం సందేహాలు వ్యక్తం చేస్తున్న ఆర్థిక నిపుణులు జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) డేటా విషయంలో ఇప్పటికే అనేక పిల్లిమొగ్గలు వేసిన కేంద్ర ప్రభుత్వం… తాజాగా మరో ట్విస్టు ఇచ్చింది. గత రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన జీడీపీ లెక్కలను తాజాగా సవరించింది. రెండేళ్లలోనూ ఇంతకు ముందు అంచనాలకంటే వృద్ధి రేటును పెంచి చూపించింది. గత అంచనాల ప్రకారం 2017-18లో భారత జీడీపీ […]

ప్రతి పేదకూ కనీస ఆదాయం : రాహుల్ గాంధీ

admin

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గ్యారంటీ అని అభయం మోడీ రెండు ఇండియాలను సృష్టిస్తున్నారని వ్యాఖ్య ‘‘ఆర్థికంగా వెనుకబడినవారికి రిజర్వేషన్లు’’ అనే పాచికను ప్రయోగించిన ప్రధాని నరేంద్ర మోడీకి ధీటుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ఎత్తులు వేస్తున్నారు. దేశంలోని ‘‘ప్రతి పేదకూ కనీస ఆదాయం గ్యారంటీ’’గా కల్పిస్తామని ప్రకటించారు. ఏప్రిల్, మే నెలల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే ఈ […]

Subscribe US Now