Category: టాప్ స్టోరీస్
6.2 శాతమే : ఇండియా వృద్ధి రేటుపై ‘మూడీస్’
దేశంలో అనేక రంగాల్లో అమ్మకాలు క్షీణించాయని వార్తలు రోజూ వస్తున్న నేపథ్యంలో స్థూల దేశీయోత్పత్తి (జి.డి.పి)పై షాకింగ్ వార్త. 2019 కేలండర్ సంవత్సరంలో భారత జీడీపీ కేవలం 6.2 శాతం పెరుగుతుందని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ తాజా అంచనాలో పేర్కొంది. ఇంతకు ముందు తానే వేసిన అంచనా (6.8 శాతం) నుంచి గణనీయంగా తగ్గించడం గమనార్హం.2020 కేలండర్ సంవత్సరంలోనూ తన అంచనాను తగ్గించిన ‘మూడీస్’, వచ్చే ఏడాది జీడీపీ వృద్ధి రేటు 6.7 శాతంగా ఉండగలదని పేర్కొంది. బలహీనంగా ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆసియా ఎగుమతులను ప్రభావితం చేసిందని, అనిశ్చిత వాతావరణంతో పెట్టుబడులు తగ్గిపోయాయని ‘మూడీస్’ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
Read More‘5 ట్రిలియన్లు’ కలేనా..?! జీడీపీ ర్యాంకుల్లో 7వ స్థానానికి జారిన ఇండియా
2024 నాటికి ఇండియా 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా పరిణతి చెందుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి బీజేపీ గల్లీ నేతల వరకు ఊరూరా చెబుతున్నారు. రెండోసారి గెలిచాక మోదీ తన ప్రధాన లక్ష్యం ఇదే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అయితే, ఈ లక్ష్యాన్ని సాధించే పరిస్థితులున్నాయా? అన్న ప్రశ్నకు సంతృప్తికర సమాధానలకంటే సందేహాలే ఎక్కువగా వినవస్తున్నాయి. 2025 నాటికి ఇండియా 5 ట్రిలియన్ డాలర్ల (రూపాయల్లో 350 లక్షల కోట్ల) ఎకానమీ కావాలంటే స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) సగటున 8 శాతం పైనే వృద్ధి చెందాల్సి ఉంటుందని ప్రభుత్వమే చెప్పింది. మరి ఆరేళ్ళపాటు అంత వృద్ధి రేటు సాధ్యమవుతుందా? ఇండియా వృద్ధి రేటు మందగమనం దిశగా సాగుతోందని తాజా విశ్లేషణలు చెబుతున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు వృద్ధి రేటు అంచనాలను తగ్గిస్తున్నాయి. నిన్న (ఆగస్టు 1న)…
Read Moreఅంగారకుడి అందం.. హబుల్ తాజా చిత్రం
హబుల్ టెలిస్కోప్ ఈ ఏడాది జూన్ 27వ తేదీన తీసిన జూపిటర్ చిత్రం ఇది. సౌర కుటుంబంలోని అతి పెద్ద గ్రహమైన అంగారకుడిపై ప్రత్యేకమైన ‘గ్రేట్ రెడ్ స్పాట్’ ఈ చిత్రంలో స్పష్టంగా కనిపిస్తోంది. అంగారకుడిపైన అతలాకుతలంగా ఉండే వాతావరణంలో మేఘాల కదలికలు హబుల్ వీడియోలో నిక్షిప్తమయ్యాయి. అంగారకుడి రంగులు, అవి మారే తీరు అధ్యయనం చేస్తున్నవారికి కొత్త క్లూలు అందిస్తున్నాయి. అంగారకుడిపై గ్రేట్ రెడ్ స్పాట్ మన భూమి కంటే పెద్ద సైజులో ఉంటుంది. అయితే, 1800 సంవత్సరం నుంచి ఈ రెడట్ స్పాట్ పరిమాణం తగ్గడాన్ని శాస్త్రవేత్తలు గమనిస్తున్నారు. దానికి కారణాలేమిటో మాత్రం ఇంతవరకు నిర్ధారణ కాలేదు. అంగారకుడు భూమికి 40 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండగా హబుల్ వైడ్ ఫీల్డ్ కెమెరా 3 చిత్రాల్లో బంధించింది. ఆ సమయంలో అంగారక గ్రహం కచ్చితంగా…
Read Moreఒకేసారి 175 సీట్లకు అభ్యర్ధుల ప్రకటన
తండ్రిని అనుసరించిన జగన్మోహన్ రెడ్డి
Read More2020 టి20 ప్రపంచ కప్ షెడ్యూళ్లివే
పురుషుల, మహిళల టోర్నీలు ఆస్ట్రేలియాలోనే.. ఇండియా మహిళల తొలి పోటీ ఆస్ట్రేలియాతో… పురుషుల టి20 తొలి మ్యాచ్ దక్షిణాఫ్రికాతో… 2020లో ఆస్ట్రేలియాలో జరగనున్న టి20 ప్రపంచ కప్ టోర్నీల షెడ్యూలును ఐసీసీ మంగళవారం విడుదల చేసింది. పురుషుల, మహిళల టి20 ప్రపంచ కప్ పోటీలు ఈసారి ఒకే ఏడాది ఒకే దేశంలో జరగడం విశేషం. ముందుగా మహిళల టి20 టోర్నీ 2020 ఫిబ్రవరి 21వ తేదీనుంచి మార్చి 8వ తేదీ వరకు జరగనుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన ఫైనల్ మ్యాచ్ ఏర్పాటు చేశారు. పురుషుల టి20 ప్రపంచ కప్ పోటీలు అక్టోబర్ 18న ప్రారంభమై నవంబర్ 15న ముగియనుంది. అక్టోబర్ 18 నుంచి 23 వరకు క్వాలిఫయర్ మ్యాచులు, ఆ తర్వాత గ్రూప్ మ్యాచులు ఉంటాయి. ఫైనల్ మ్యాచ్ నవంబర్ 15న జరుగుతుంది. మహిళల టోర్నీలో ఇండియా…
Read Moreమోడీ ఓటమి ఖాయం
లోక్ సభ ఎన్నికల సైరన్.. మార్చి తొలి వారంలో షెడ్యూలు
ఆంధ్రప్రదేశ్ సహా 5 అసెంబ్లీలకు కూడా…
2014లో 9 దశల్లో పోలింగ్.. మరి ఈసారి?
ఈబీసీ రిజర్వేషన్ బిల్లుకు లోక్ సభ ఆమోదం
రేపు రాజ్యసభలో చర్చ.. అందుకోసం సమావేశాలు ఒకరోజు పొడిగింపు
Read Moreఠాగూర్ పేరూ చేదైందా?!!
మొదట ముస్లిం రాజుల పేర్లు మార్చాలన్నారు.. ఇప్పుడు జాతీయ గీతం రచయితదాకా వచ్చారు.. పట్నాలో గురు రబీంద్ర చౌక్ పేరు మార్పునకు ప్రతిపాదన.. వ్యతిరేకతతో వెనక్కు తగ్గిన మున్సిపల్ కార్పొరేషన్
Read More