జన్మభూమి 10 రోజుల చర్చనీయాంశాలు

జనవరి 2వ తేదీనుంచి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఐదో విడత ‘జన్మభూమి మా ఊరు’ కార్యక్రమంలో ఏ రోజు ఏ అంశాన్ని చేపట్టాలో వివరిస్తూ ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో జనవరి 7న ఉదయం 6.30 నుంచి 7.30 వరకు 5కే రన్ నిర్వహించాలని, చివరి రోజైన 11న మండల కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు లబ్దిదారులకు ఆస్తుల పంపిణీ చేపట్టాలని సిఎం ఆదేశించారు. మండల కేంద్రాల్లో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించాలని కూడా ఆయన ఆదేశించారు. 10 రోజుల అంశాలకోసం క్లిక్ చేయండి జన్మభూమి షెడ్యూలు… Janmabhoomi Schedule

Read More

కలెక్టర్లతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్

జనవరి 2 నుంచి 11 వరకు నిర్వహించనున్న ‘జన్మభూమి-మాఊరు’ కార్యక్రమంపై జిల్లాల కలెక్టర్లు, శాఖాధిపతులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐదో విడత నిర్వహించబోతున్న ‘జన్మభూమి-మాఊరు’ కార్యక్రమంలో పది రోజులపాటు నిర్వహించే కార్యక్రమాలపై ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. ప్రజా వినతులను నూరు శాతం పరిష్కరించడమే లక్ష్యమన్న సిఎం…వినతులను ఆర్ధిక, ఆర్ధికేతర అంశాలుగా విభజించి వేగవంతంగా పరిష్కరించే బాధ్యతను కలెక్టర్లు తీసుకోవాలని సూచించారు. కుటుంబ వికాసం, సమాజ వికాసం కూడా ముఖ్యమన్న సిఎం… మౌలిక వసతుల కల్పనతో సరిపెట్టకుండా టెక్నాలజీ పరంగా ముందడుగు వేయాలని చెప్పారు. జన్మభూమిలో వ్యాసరచన, చిత్రలేఖనం, క్రీడలు, చర్చా కార్యక్రమాల్లో విజేతలకు బహుమతులు అందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.

Read More