జార్జ్ ఫెర్నాండెజ్ మృతి

రక్షణ, రైల్వే శాఖల మాజీ మంత్రి, సమతా పార్టీ నాయకుడు జార్జి ఫెర్నాండెజ్ (88) మంగళవారం ఢిల్లీలో మరణించారు. కార్మిక సంఘం నేతగా, 1975 ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పోరాడిన నాయకుల్లో ఒకరిగా ఫెర్నాండెజ్ ప్రముఖులు. వాజ్ పేయి ప్రభుత్వంలో ఆయన రక్షణ శాఖ మంత్రిగా పని చేశారు. ఫెర్నాండెజ్ మృతికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సంతాపం వెలిబుచ్చారు. 

Read More