ఇండియా ఎకనామిక్ సమ్మిట్ లో చంద్రబాబు (వీడియో, ఫొటోలు)

admin

ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) న్యూఢిల్లీలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఇండియా ఎకనామిక్ సమ్మిట్ లో రెండో రోజైన గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. బుధవారం ప్రారంభమైన ఈ సదస్సు శుక్రవారం వరకు కొనసాగనుంది. వివిధ రంగాల్లో ఫలితాలు సాధించినవారిని డబ్ల్యూఈఎఫ్ ఈ సదస్సుకు ఆహ్వానించింది. గురువారం ఒక సెషన్ లో వక్తగా చంద్రబాబు హాజరయ్యారు. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి హరిసిమ్రత్ కౌర్ బాదల్ కూడా చంద్రబాబుతో కలసి ఈ సెషన్ కు హాజరయ్యారు. ఈ సదస్సు సందర్భంగా కేంద్ర పరిశ్రమలు-వాణిజ్య శాఖల మంత్రి సురేష్ ప్రభుతో ముఖ్యమంత్రి విడిగా సమావేశమయ్యారు. ప్రపంచ ఆర్థిక వేదిక మేనేజింగ్ బోర్డు సభ్యుడు, నాలుగో పారిశ్రామిక విప్లవ కేంద్రం హెడ్ మురాత్ సొంమెజ్ తోనూ, లులు గ్రూపు చైర్మన్ యూసఫ్ అలీతోనూ చంద్రబాబు విడివిడిగా భేటీ అయ్యారు.

కేంద్ర మంత్రి సురేష్ ప్రభుతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ

 

లులు గ్రూపు చైర్మన్ యూసఫ్ అలీతో సీఎం చర్చలు

 

సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ హెడ్ మురాత్ సొంమెజ్-చంద్రబాబు సమావేశం

Share It

Leave a Reply

Next Post

రియో ఒలింపిక్స్ ఛైర్మన్ అరెస్ట్

2016 రియో ఒలింపిక్స్ ఛైర్మన్ గా వ్యవహరించిన బ్రెజిల్ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు కార్లోస్ నుజ్ మాన్ అరెస్టయ్యారు. ఒలింపిక్ బిడ్ గెలుచుకోవడానికి ఓట్ల కొనుగోలుకు పాల్పడ్డారన్న అభియోగాన్ని కార్లోస్ ఎదుర్కొన్నారు. బ్రెజిల్ కాల మానం ప్రకారం కార్లోస్ ను గురువారం ఉదయం 6:00 గంటలకు ఆయన నివాసంలోనే అరెస్ట్ చేశారు. కార్లోస్ కుడి భుజంగా భావించే లియోనార్డో గ్రైనర్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. Share ItShareTweetLinkedIn

Subscribe US Now

shares