కేబినెట్ ఇన్ సైడ్ : డెంగ్యూ మరణాలపై సిఎం సీరియస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెంగ్యూ జ్వరం కారణంగా సంభవించిన మరణాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీరియస్ అయ్యారు. వైద్య ఆరోగ్య శాఖపై సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలోని ముఖ్యమంత్రి బ్లాకులో జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే ఈ అంశాన్ని ప్రస్తావించిన సిఎం… అధికారులపై మండిపడ్డారు.

సీజనల్ వ్యాధుల విషయంలో ఆరోగ్య శాఖ ముందే హెచ్చరించినా మేలుకోలేదంటూ ముఖ్యమంత్రి ఇదివరకు కూడా అనేక సందర్భాల్లో మంత్రివర్గ సమావేశంలోనే మండిపడ్డారు. మంగళవారంనాటి మంత్రిమండలి సమావేశంలోనూ ఆరోగ్య శాఖకు అక్షింతలు తప్పలేదు. ఇకపైన డెంగ్యూ, ఇతర సీజనల్ అంశాలపై నిరంతరం తానే సమీక్ష చేస్తానని చంద్రబాబు చెప్పారు.

Leave a Comment