Read Time:1 Minute, 16 Second
వివాదాస్పదమైన ఓ వాణిజ్య ప్రకటనకు గాను మహిళల ఆగ్రహాన్ని చవి చూసిన సబ్బుల కంపెనీ డోవ్, తాజాగాా ఆ అంశంపై క్షమాపణలు కోరింది. డోవ్ వాడితే తెల్లగా మారతారనే అర్ధం వచ్చేలా… రూపొందించిన ఓ యాడ్ జాతి వివక్షను ప్రతిఫలించేలా ఉందని విమర్శలు వచ్చాయి. డోవ్ యాడ్ లో ఓ నల్లజాతి మహిళ తన బ్రౌన్ కలర్ షర్ట్ ను తీసివేయగానే ఆమె స్థానంలో తెల్లజాతి మహిళ కనిపిస్తుంది. కంపెనీ జీఐఎఫ్ యాడ్ నుంచి స్క్రీన్ షాట్లు తీసి కొంతమంది సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఇది తీవ్ర స్థాయిలో చర్చనీయాంశం కావడంతో కంపెనీ స్పందించాల్సి వచ్చింది.
డోవ్ బ్రిటిష్-డచ్ కంపెనీ యూనిలివర్ సొంతం. ఆ యాడ్ చేసినప్పుడు తాము అనుకున్న అర్ధం సరిగా ప్రతిఫలించలేదని పేర్కొన్న డోవ్, తమ ఫేస్ బుక్ పేజీనుంచి ఆ పోస్టును తొలగించింది.