కరెస్పాండెన్స్ ఇంజనీరింగ్ డిగ్రీలు రద్దు.. సుప్రీం సంచలన తీర్పు

0 0
Read Time:3 Minute, 11 Second

2001 తర్వాత డీమ్డ్ యూనివర్శిటీలు ఆఫర్ చేసిన కరెస్పాండెన్స్ కోర్సుల ద్వారా పొందిన ఇంజనీరింగ్ డిగ్గీలు చెల్లవని సుప్రీంకోర్టు శుక్రవారం ప్రకటించింది. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) గానీ, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఎఐసిటిఇ) గానీ ఇంజనీరింగ్ విద్యలో దూర విద్యా కార్యక్రమాలకు అనుమతి ఇవ్వలేదని గుర్తు చేసిన సుప్రీంకోర్టు, ఈ విషయంలో దూర విద్యా మండలి (డిఇసి) మంజూరు చేసిన అనుమతులు చెల్లవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు… ఇంజనీరింగ్ విద్యలో దూర విద్యా కోర్సులకు అనుమతి ఇచ్చిన అధికారులపై సీబీఐ విచారణకు ఆదేశించింది.

జస్టిస్ ఎకె గోయల్, యుయు లలిత్ లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఎఐసిటిఇ నిరాకరించినా 2001నుంచి కరెస్పాండెన్స్ ద్వారా ఇంజనీరింగ్ కోర్సులు ఆఫర్ చేస్తున్న నాలుగు వర్శిటీలపై నమోదైన కేసులను సుప్రీంకోర్టు విచారణకు చేపట్టింది. రాజస్థాన్ లోని జెఆర్ఎన్ రాజస్థాన్ విద్యాపీఠ్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్, అలహాబాద్ వ్యవసాయ సంస్థ, తమిళనాడులోని వినాయక మిషన్ రీసెర్చ్ ఫౌండేషన్ సంబంధించిన కరెస్పాండెన్స్ ఇంజనీరింగ్ కోర్సుల ద్వారా ఇచ్చిన డిగ్రీల చెల్లుబాటుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. శుక్రవారం పై తీర్పును వెలువరించింది.

గత 16 సంవత్సరాలలో ఆయా డిగ్రీలు పొందిన వేలాది మంది విద్యార్ధులకు ఈ తీర్పు ఆశనిపాతమే. ఇప్పటికే ఆయా డిగ్రీ సర్టిఫికెట్ల ఆధారంగా ఉద్యోగాలు పొందినవారు ఇప్పుడు వాాటిని కోల్పోయే అవకాశం ఉంది. విద్యా వ్యాపారాన్ని అరికట్టడంలో యుజిసి పూర్తిగా విఫలమైందని వ్యాఖ్యానించిన న్యాయమూర్తులు, డీమ్డ్ వర్శిటీల నియంత్రణకు ఒక పర్యవేక్షక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్రానికి మార్గనిర్దేశనం చేశారు. వివిధ సంస్థలకు ఇచ్చిన డీమ్డ్ వర్శిటీ హోదాను సమీక్షించాలని కూడా ప్రభుత్వానికి సూచించారు.

సుప్రీంకోర్టు తీర్పుతో.. మన విద్యా నియంత్రణా మండళ్ల పని తీరును, సమన్వయ లోపం ఏ స్థాయిలో ఉన్నాయో మరోసారి వెల్లడైంది.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply