టైమ్స్ నౌ ప్రకారం… తెలుగుదేశం పతనం!!

3 0
Read Time:4 Minute, 11 Second
 

లోక్ సభ ఎన్నికల్లో కేవలం రెండే సీట్లు వస్తాయంటున్న సర్వే…

వైసీపీ ఏకంగా 23 లోక్ సభ సీట్లు సాధిస్తుందని అంచనా

లోక్ సభ ఎన్నికలు సమీపించేకొద్దీ రాజకీయ పార్టీలతో పాటు మీడియా సంస్థలు సర్వేల జోరు పెంచాయి. ఇటీవల ఇండియా టుడే, రిపబ్లిక్ టీవీ సర్వేలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బుధవారం టౌమ్స్ నౌ టీవీ సర్వే వెల్లడైంది.

టౌమ్స్ నౌ ప్రకారం… 2019 లోక్ సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వశమవుతుంది! రాష్ట్రంలో ఉన్న 25 లోక్ సభ సీట్లలో ఏకంగా 23 వైసీపీ కైవశమవుతాయని టౌమ్స్ నౌ అంచనా వేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి కేవలం రెండు లోక్ సభ సీట్లు వస్తాయని ఆ సంస్థ సర్వే చెబుతోంది. మూడో ప్రత్యామ్నాయంగా ముందుకొస్తున్న జనసేన పార్టీకి ఒక్క లోక్ సభ సీటు కూడా ఇవ్వకపోవడం గమనార్హం.

2014 లోక్ సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 15 సీట్లు రాగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లు లభించాయి. టీడీపీతో పొత్తుతో బీజేపీ మిగిలిన రెండు లోక్ సభ సీట్లను దక్కించుకుంది. లోక్ సభతో పాటు రాష్ట్ర అసెంబ్లీకి కూడా జరిగిన ఎన్నికలతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది.

టౌమ్స్ నౌ సర్వే ప్రకారమైతే… 2014 ట్రెండ్ రివర్స్ కావడంతోపాటు… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసాధారణమైన ఆధిపత్యం లభిస్తుంది. ఆ పార్టీకి రాష్ట్రంలో 49.5 శాతం ఓట్లు లభిస్తాయని, తెలుగుదేశం పార్టీకి కేవలం 36 శాతమే వస్తాయి.

ఢిల్లీలో హంగ్

దేశం మొత్తంమీద ఎన్డీయేకు 252 సీట్లు, యుపిఎకు 147 సీట్లు, ఇతరులకు 144 సీట్లు వస్తాయని టౌమ్స్ నౌ సర్వే చెబుతోంది. 2014 ఎన్నికల్లో బీజేపీకే 282 సీట్లు రాగా, ఆ పార్టీ నాయకత్వంలో ఏర్పాటైన ఎన్డీయేకి 336 సీట్లు ఉన్నాయి. ఈసారి మొత్తం ఎన్డీయే పార్టీలన్నీ కలసినా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 272 సీట్లు రావని సర్వేలు చెబుతున్నాయి.

ఇంతకు ముందు టైమ్స్

అంతకు ముందు రిపబ్లిక్ టీవీ సర్వే ఎన్డీయేకు 233 సీట్లు, యూపీఏకు 167, ఇతరులకు 143 సీట్లు ఇచ్చింది. రిపబ్లిక్ టీవీతో పోలిస్తే టౌమ్స్ నౌ బీజేపీ కూటమికి ఓ 19 సీట్లు అదనంగా ఇచ్చింది.

 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
100 %