పెట్టుబడులే లక్ష్యంగా… ఏపీ మంత్రివర్గం భూ కేటాయింపులు (మొత్తం జాబితా)

2 0
Read Time:14 Minute, 31 Second
మంగళవారంనాటి మంత్రివర్గం కేటాయించిన భూములు వివరాలివి…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వం భూ కేటాయింపులు చేస్తోంది. తాజాగా మంగళవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలోనూ ఇదే రిపీటైంది. పెద్ద మొత్తంలో చేసిన భూ కేటాయింపులలో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఎపిఐఐసి) సింహభాగం పొందింది. దీనికి తోడు రాజధాని అమరావతి పరిధిలో 6 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 39 వేల కోట్ల) పెట్టుబడి ప్రతిపాదనలతో వచ్చిన వివిధ సంస్థలకు చేసిన భూ కేటాయింపులను కూడా మంత్రివర్గం ఆమోదించింది.
అమరావతిలో భూములు కేటాయించిన సంస్థలలో గోపిచంద్ బ్యాట్మింటన్ అకాడమీ, బ్రహ్మకుమారీ సొసైటీ, నందమూరి బసవ తారక రామారావు మెమోరియల్ కేన్సర్ ఫౌండేషన్, జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ (XLRI), LV ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌ ఉన్నాయి. కొత్తగా భూముల కేటాయింపు, ఇతర ప్రతిపాదనలపై మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలివి.
కొత్తగా కేటాయింపులు :
• విశాఖ జిల్లా పెందుర్తి మండలం గుర్రంపాలెం గ్రామంలోని సర్వే నెం. 157, 174 వగైరాలలోని 247.37 ఎకరాలను ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు నిమిత్తం ఏపీఐఐసీకి కేటాయిస్తూ మంత్రిమండలి ఆమోదం.
• కడప జిల్లా రైల్వే కోడూరు గ్రామంలోని సర్వే నెం. 2085/1లోని 17.74 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు నిమిత్తం ఏపీఐఐసీకి కేటాయిస్తూ మంత్రిమండలి ఆమోదం.
• అనంతపురము జిల్లా రాప్తాడులో సర్వే నెం.274/5, 274/8 లో గల 17.63 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు నిమిత్తం ఏపీఐఐసీకి అప్పగిస్తూ మంత్రిమండలి ఆమోదం.
• విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కుమ్మిలి గ్రామంలో సర్వే నెం.1/1P లో గల 11 ఎకరాల భూమిని విజయనగరం జిల్లా తారకరామ తీర్థ సాగర్ ప్రాజెక్టు ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్‌కు అప్పగిస్తూ మంత్రిమండలి ఆమోదం. ఈ ప్రాజెక్టు కోసం గతంలో అటవీశాఖ నుంచి తీసుకున్న భూమికి బదులుగా ఈ భూమిని కేటాయించారు. తారకరామ తీర్థ సాగర్ ప్రాజెక్టు ఈ భూమిని అటవీశాఖకు ప్రత్యామ్నాయంగా అందిస్తారు.
• విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలంలోని కాపులుప్పాడ గ్రామంలోని సర్వే నెం. 407/7 P, 407/3లలోని 4 ఎకరాల భూమిని ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు నిమిత్తం గిరిజన సంక్షేమ శాఖకు అప్పగించడానికి మంత్రిమండలి ఆమోదం.
• ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం నాయుడుపాలెం గ్రామం సర్వే నెంబర్ 104/1లో 63 ఎకరాలు, చిన్నలతరపి గ్రామం సర్వే నెంబర్ 607/4లో 132 ఎకరాలు74 సెంట్ల (మొత్తం 195 ఎకరాల 74 సెంట్లు) భూమిని ఉద్యాన కళాశాల ఏర్పాటుకోసం వెంకటరామన్నగూడెంలోని డా. వై.ఎస్.ఆర్ హార్టికల్చర్ యూనివర్శిటీ వైస్-ఛాన్స్‌లరుకు ఉచితంగా కేటాయించే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
• గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పెదతురకపాలెం శివారు ఎలమంద గ్రామంలో సర్వే నెం, 592/4-లో 5 ఎకరాల పోరంబోకు భూమిని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల నిర్మాణానికి ఉచితంగా బదలాయించే ప్రతిపాదనను మంత్రిమండలి ఆమోదించింది.
• శ్రీ పొట్టి శ్రీరాములు మండలం ఎ.ఎస్. పేట మండలం రాజవోలు గ్రామం సర్వే నెం. 251లో 4 ఎకరాల 4 సెంట్ల భూమిని నడికూడి-శ్రీకాళహస్తి బ్రాడ్‌గేజ్ రైలు మార్గంలో వరల్డ్ క్లాస్ స్టేషన్ ప్రాజెక్టు నిర్మాణం కోసం డిప్యూటీ చీఫ్ ప్రాజెక్టు మేనేజర్‌కు ఉచితంగా స్వాధీనపర్చే ప్రతిపాదనను రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించింది.
• గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పెదతురకపాలెం శివారు ఎలమంద గ్రామంలో గ్రామ పోరంబోకుగా వర్గీకరించిన సర్వే నెం 592/23-A2B3లో 5 ఎకరాల భూమిని సైంటిఫిక్ డ్రైవింగ్ రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ అధికారి కార్యాలయ నిర్మాణం కోసం గుంటూరు డిప్యూటి ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌కు బదలాయించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
• గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పెదతురకపాలెం శివారు ఎలమంద గ్రామంలో గ్రామ పోరంబోకుగా వర్గీకరించిన సర్వే నెం: 592/4/B ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల, బాలుర జూనియర్ కాలేజీ నిర్మాణం కోసం మైనారిటీ సంక్షేమ విభాగానికి బదలాయించే ప్రతిపాదనను రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించింది. మల్టీ సెక్టోరియల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (MsDP) కింద భవనాలను నిర్మిస్తారు.
• అనంతపురం జిల్లా రామగిరి మండలం రామగిరి గ్రామంలో సర్వే నెం. 541-1, సర్వే నెం. 542-2 లో ఉన్న 18 ఎకరాల 37 సెంట్ల భూమిని అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణం కోసం ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌కు ఉచితంగా బదలాయించే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది.
• అనంతపురం జిల్లా లేపాక్షి మండలం లేపాక్షి గ్రామం సర్వే నెం.406/23 ఎకరం భూమిని టీటీడీ కల్యాణ మండప నిర్మాణం నిమిత్తం ఉచితంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వాధీనపరిచే ప్రతిపాదనను రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించింది.
• విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం బలిఘట్టం గ్రామం సర్వే నెం. 262లో మునిసిపల్ డంపింగ్ యార్డు కోసం 5 ఎకరాల భూమిని నర్సీపట్నం పురపాలక సంఘం కమిషనరుకు స్వాధీనపరిచే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ భూమిని ఉచితంగా అందిస్తారు.
• విశాఖ జిల్లా యలమంచిలిలో సర్వే నెం. 1 లో 1.75 ఎకరాలు, సర్వే నెం.2లో 50 సెంట్ల (మొత్తం 2.25 ఎకరాలు) ప్రభుత్వ భూమిని డంపింగ్ యార్డుకు, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ పార్క్ కోసం ముందస్తుగా స్వాధీనపరిచే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
• పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలో చెత్తనుంచి ఇంధనం తయారీ ప్లాంటుకు గతంలో పేర్కొన్నట్లుగా కొండ్రప్రోలు గ్రామంలో కాకుండా, అందుకు బదులుగా కుంచనపల్లి గ్రామంలో సర్వే నెం. 192లో 14.74 ఎకరాల భూమి కేటాయించే ప్రతిపాదనను మంత్రిమండలి ఆమోదించింది. ముందస్తు స్వాధీనానికి కలెక్టరుకు అనుమతించింది.
• శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలం, కావలి పురపాలక సంఘ పరిధిలోని మద్దూరుపాడు గ్రామం సర్వే నెం. 17, 18, 19, 20ల్లో బలహీన వర్గాల గృహనిర్మాణం కోసం 20.90 ఎకరాల భూమి ముందస్తు స్వాధీన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. జిల్లా కలెక్టర్ ద్వారా అర్హులైన CJFS లీజుదార్లకు నష్టపరిహారం, బకాయిల చెల్లింపునకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖను అనుమతించింది.

• శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు బిట్-1 గ్రామం సర్వే నెం. 2153/1లో 10.కె.డబ్ల్యు ఎఫ్.ఎం. ట్రాన్స్‌మీటర్ ఏర్పాటుకోసం ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాలకు 1.31 ఎకరాల కేటాయింపు. ముందస్తుగా స్వాధీనం చేసుకుని బదలాయించే కలెక్టర్ చర్యను మంత్రివర్గం ధృవీకరించింది. ఈ భూమిని చెన్నయ్ ఆకాశవాణి, దూదర్శన్‌ల డిప్యూటీ డైరెక్టర్ (ఎస్.పి), ఏడీ (ఇ.ఇఎస్ జెడ్), అడిషనల్ డైరెక్టర్ జనరల్‌కు బదలాయిస్తారు.• శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం పూడూరు గ్రామంలో సర్వే నెంబర్లు 317,318, 319, 320లలో 39.17 ఎకరాల భూమిని పీఎంఎవై హౌసింగ్ కాలనీ నిర్మాణం కోసం నాయుడుపేట మునిసిపాలిటీకి ముందస్తు స్వాధీన ప్రతిపాదనను రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించింది.

• గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు నిమిత్తం తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలోని సర్వే నెం.212, 219, 230లలో ఎఎల్ఈఐకు కేటాయించిన 34.19 ఎకరాల భూమికి రూ.10.45 లక్షల ధరను ఎకరా రూ. 8.29 లక్షలకు తగ్గిస్తూ మంత్రిమండలి ఆమోదం.

• గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు నిమిత్తం నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం బొడ్డువారిపాలెం గ్రామంలో ఎఎల్ ఇఐకి కేటాయించిన 4.15 ఎకరాల భూమికి రూ.22.02 లక్షల ధరను ఎకరా రూ. 7.90 లక్షలకు తగ్గిస్తూ మంత్రిమండలి ఆమోదం.
సీఆర్‌డీఏ భూ కేటాయింపులు :
• సీఆర్‌డీఏ రీజియన్‌లో వివిధ ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలకు అవసరమైన భూ కేటాయింపులకు మంత్రిమండలి ఆమోదం.
• రాబోయే పదేళ్లలో అమరావతిలో 6 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఆయా సంస్థలకు అవసరమైన భూ కేటాయింపులు జరుపుతోంది.
• ఆయా సంస్థలు చేసిన అభ్యర్థనలు, ప్రతిపాదనలు పరిశీలించి ప్రభుత్వం ఈ కేటాయింపులు జరిపింది. ఈ కేటాయింపుల ద్వారా రాజధాని ప్రాంతం వైబ్రేంట్ ఎకనామిక్ హబ్‌గా మారనున్నది.

• ఈ కేటాయింపుల ద్వారా ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు, వైద్య సంస్థలు అమరావతిలో కొలువుదీరనున్నాయి.

• గోపిచంద్ బ్యాట్మింటన్ అకాడమీ, బ్రహ్మకుమారీ సొసైటీ, నందమూరి బసవ తారక రామారావు మెమోరియల్ కేన్సర్ ఫౌండేషన్, జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ (XLRI), LV ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌లకు భూములు కేటాయిస్తూ మంత్రిమండలి ఆమోదం.

దివి లేబరేటరీస్ అదనపు భూమి లోకల్ అథారిటీ పరిధిలోకి…
• ఏపీఐఐసీ విజ్ఞప్తి మేరకు దివీస్ లేబరేటరీ కొనుగోలు చేసిన అదనపు భూమిని ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ (ఐఎఎల్ఎ) నోటిఫికేషన్‌తో ఏపీఐఐసీ పరిధిలోకి తీసుకురావడానికి రూపొందించిన ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించింది.
• దివి లేబరేటరీస్ కంపెనీ చిప్పాడ, అన్నవరం, భీమునిపట్నం, విశాఖ పరిధిలోని 314.30 ఎకరాల భూమిలో రెండో యూనిట్ ప్రారంభించింది. ఈ భూమిని ఏప్రిల్ 2002లో ఏపీఐఐసీ నుంచి పొందారు.
• ఎగుమతుల డిమాండ్ వల్ల కంపెనీ విస్తరణ అనివార్యమైంది. అందువల్ల దివి కంపెనీ పక్కనే ఉన్న విజయనగరానికి చెందిన ’మానస’ ట్రస్టు నుంచి ఉడా నిర్వహించిన బహిరంగ వేలం ద్వారా 71.21 ఎకరాలు కొనుగోలు చేసింది.
• జీఓ ఎంఎస్ నెం. 109 PR&ఇD ద్వారా 9.3.98 న చిప్పాడ, అన్నవరం గ్రామాలను ఐఎఎల్ఎగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాము చిప్పాడ అదనంగా కొనుగోలు చేసిన భూమిని 147 పంచాయతీరాజ్ యాక్ట్ 1994 ద్వారా ఐఎఎల్ఎ పరిధిలోచేర్చాలని విజ్ఞప్తి చేశారు.

 

 

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply