-
విదేశీ పర్యటనలో అందుకోనున్న సిఎం..
-
18 నుంచి 26వరకు అమెరికా, యుఎఇ, లండన్ పర్యటన..
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిష్ఠాత్మక గోల్డెన్ పీకాక్ అవార్డు అందుకోనున్నారు. ఈనెల 18 వ తేదీ నుంచి తలపెట్టిన మూడు దేశాల పర్యటనలో భాగంగా చంద్రబాబు యుకెలో ఈ అవార్డును స్వీకరిస్తారు. పెట్టుబడుల ఆకర్షణ, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, అమరావతి పరిపాలన నగరం తుది ఆకృతుల ఖరారు లక్ష్యంగా అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇంగ్లండ్‌లలో చంద్రబాబు పర్యటించబోతున్నారు. ఈనెల 18వ తేదీ నుంచి 20 వరకు అమెరికాలో, 21 నుంచి 23వ తేదీ వరకు యుఎఇలో, చివరిగా 24 నుంచి 26వ తేదీ వరకు యుకెలో ముఖ్యమంత్రి పర్యటిస్తారు.
మూడు దేశాలలో ముఖ్యమంత్రి అనేకమంది రాజకీయ, వ్యాపార, వాణిజ్య ప్రముఖులతో ద్వైపాక్షిక సమావేశాలు, ముఖాముఖి సమావేశాలు, బహుముఖ చర్చలు, మరికొన్ని ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి.. అమెరికాలోని న్యూయార్క్, చికాగో, డెమాయిన్స్, ఐయోవా, యుఎఇలో దుబాయ్, అబుదాబీ, యుకెలో లండన్ నగరాలను సందర్శిస్తారు.
అమెరికాలో ఐయోవా గవర్నర్, ఐయోవా స్టేట్ యూనివర్శిటీ ప్రెసిడెంట్, అగ్రికల్చర్ సెక్రటరీ నార్తీ, మరికొందరు ప్రముఖులతోనూ… యుఎఇలో ఎమిర్ ఆఫ్ దుబాయ్, మినిస్టర్ ఫర్ హ్యాపినెస్, మినిస్టర్ ఫర్ ఎకానమీ, ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ చైర్మన్, బిన్ జాయేద్ గ్రూపు చైర్మన్, ఆస్టర్ గ్రూప్ చైర్మన్ ఆజాద్ మోపెన్, అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, అబుదాబీ కల్చర్, యూత్, సోషల్ డెవలప్మెంట్ మినిస్టర్ నహ్యన్ బిన్ ముబారక్ అల్ నహ్యన్, లూలూ గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ, బీఆర్ షెట్టిలతోనూ… ఇంగ్లండ్‌లో నార్మన్ ఫోస్టర్తోనూ ముఖ్యమంత్రి సమావేశం అవుతారు.
అమెరికా పర్యటన : (18 వ తేదీ నుంచి 20 వరకు)
చికాగోలో గ్లోబల్ తెలుగు ఎంటర్‌ప్రెన్యూర్స్ నెట్వర్క్ (జీటెన్) సభ్యులతో మీటింగ్
ఐటీ కంపెనీల ప్రతినిధులతో సమావేశం
ఐయోవా స్టేట్ యూనివర్సిటీ క్యాంపస్ సందర్శన
వర్చువల్ రియాల్టీ అప్లికేషన్ సెంటర్ సందర్శన
రీసెర్చ్ పార్కులో రౌండ్ టేబుల్ సమావేశం
నాలెడ్జ్ కన్సార్టియంలో చర్చ
ఐయోవా గవర్నర్ ఇచ్చే విందు
కర్నూలు జిల్లాలో నిర్మిస్తున్న మెగా సీడ్ పార్కు ప్రాజెక్టుపై 350 మందితో స్టేక్ హోల్డర్స్ కన్సల్టేషన్ వర్క్‌షాప్, టాప్ సైంటిస్టులు, సీడ్ కంపెనీలు, అగ్రీ కంపెనీల ప్రతినిధులతో కర్నూలు సీడ్పార్కుపై వివరణ.
పయినీర్ గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ పర్యటన, వ్యవసాయ క్షేత్రంలో సందర్శన
ఐయోవా ఎకనామిక్ డెవలప్మెంట్ అథారిటీ, ఐయోవా స్టేట్ వర్శిటీ రౌండ్ టేబుల్ సమావేశం
సీడ్, అగ్రి కంపెనీలతో రౌండ్ టేబుల్ సమావేశం.
ఐయోవా స్టేట్ యూనివర్శిటీ ప్రెసిడెంట్, వేగనింగన్ యూనివర్శిటీ, ఐయోవా ఫామ్ బ్యూరో, ఘనా సిఎస్ ఐఆర్ డైరెక్టర్ జనరల్, నార్తీ సెక్రటరీలతో ద్వైపాక్షిక సమావేశాలు
వరల్డ్ ఫుడ్‌ప్రైజ్ 2017 పురస్కార ప్రదానోత్సవం
వివిధ కంపెనీల సీఈవోలు, సీఎక్స్‌వోలతో లంచ్ మీటింగ్
యుఎఇ టూరు : (21 వ తేదీ నుంచి 23 వరకు)
ఎన్ ఆర్ ఐలతో సమావేశం
బిజినెస్ లీడర్స్ ఫోరమ్‌తో సమావేశం (25 బడా పారిశ్రామికవేత్తలతో సమావేశం)
ఎమిరేట్స్ నేషనల్ బ్యాంక్ ఆఫ్ దుబాయ్ రాయల్ ఫ్యామిలీ వెల్త్ మేనేజర్‌తో
ఎమిరేట్స్ గ్రూపు-దుబాయ్ నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ తో భేటీ
ఒమన్ ఎండోమెంట్ మినిస్టర్‌తో సమావేశం (ఏపీలో ఎయిర్‌పోర్టు ఎకోసిస్టమ్‌పై చర్చ)
యుఎఇ ప్రభుత్వ, పరిశ్రమల ప్రతినిధులతో ద్వైపాక్షిక సమావేశాలు
బిన్ జాయేద్ గ్రూపు అధిపతితో సమావేశం
ఘంటూట్ షిప్పింగ్ అధిపతితో సమావేశం
ఆస్టర్ గ్రూపు అధిపతితో సమావేశం
షేక్ జాయేద్ గ్రాండ్ మసీదు సందర్శన
అబుదాబీలతోని రాజకీయ, వర్తక, వాణిజ్య ప్రముఖులతో డిన్నర్ సమావేశం
అబుదాబీ క్రౌన్స్ ప్రిన్స్
అబుదాబీ ఇన్వెస్టుమెంట్ అథారిటీ అధిపతితో సమావేశం
అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ అధిపతితో సమావేశం
ముబదాల సంస్థ అధిపతితో సమావేశం
లులూ గ్రూపు చైర్మన్ యూసఫ్ అలీ ఇచ్చే విందు సమావేశం
సెన్నట్ గ్రూపుతో ద్వైపాక్షిక సమావేశం
రొటానా గ్రూపుతో ద్వైపాక్షిక సమావేశం
ఎమిరేట్స్ ప్యాలెస్‌లో ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొషెషనల్ గ్రూప్ హై టీ
డాక్టర్ బీఆర్ షెట్టితో పాటు అగ్రశ్రేణి పెట్టుబడిదారులతో ఎక్స్‌క్లూజివ్ డిన్నర
యుకె పర్యటన : (24 వ తేదీ నుంచి 26 వరకు)
ఫోస్టర్ అండ్ పార్టనర్స్‌తో సమావేశం
యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ తో రౌండ్ టేబుల్ సమావేశం
ఇన్వెస్టర్లతో ముఖాముఖి
కంపెనీ డైరెక్టర్ల నాన్ ప్రోఫిట్ అపెక్స్ అసోసియేషన్-ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ ఆధ్వర్యంలో 10 కంపెనీల సీఈవోలతో రౌండ్ టేబుల్ సమావేశం
గోల్డెన్ పీకాక్ అవార్డ్స్ ఫర్ కార్పొరేట్ గవర్నెన్స్ అండ్ సస్టెయినబులిటీ
ముఖ్యమంత్రి బృందంలో సభ్యులు
అమెరికా : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు డా. పరకాల ప్రభాకర్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి సాయి ప్రసాద్, ఈడీబీ సీఈవో జాస్తి కృష్ణ కిషోర్, ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి, భద్రతా సిబ్బంది.
అరబ్ ఎమిరేట్స్ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, పురపాలక మంత్రి పి. నారాయణ, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ఏపీఎన్ఆర్టీ వేమూరి రవి, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి. సాయి ప్రసాద్, ఎనర్జీ, ఇన్ఫ్రా ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, పరిశ్రమలశాఖ కార్యదర్శి సోలోమన్ ఆరోఖ్యరాజ్, ఈడీబీ సీఈవో జాస్తి కృష్ణ కిషోర్, ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి, భద్రతా సిబ్బంది.
బ్రిటన్ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, పురపాలక మంత్రి పి. నారాయణ, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి సాయిప్రసాద్, ఎనర్జీ, ఇన్ఫ్రా ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, ఈడీబీ సీఈవో జాస్తి కృష్ణ కిషోర్, ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి, భద్రతా సిబ్బంది.