భారతీయ మిసైల్ సక్సెస్

దేశీయంగా రూపొందించిన యాంటీ ట్యాంకు మిసైల్ ‘హెలినా’ను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డి.ఆర్.డి.ఒ) ఆదివారం విజయవంతంగా ప్రయోగించింది. హెలికాప్టర్ నుంచి ప్రయోగించే ఈ మిసైల్ ప్రయోగ కేంద్రంగా పోఖ్రాన్ ను ఎంచుకుంది. స్వదేశీ పరిజ్నానంతో అభివృద్ధి చేసినందున ఈ పరీక్షకు ప్రాధాన్యత ఉంది. 1999లో అణు పరీక్ష నిర్వహించిన రాజస్థాన్ లోని పోఖ్రాన్ లోనే ‘హెలినా’ ప్రయోగం జరపడం విశేషం.

‘హెలినా’ అంటే… హెలికాప్టర్ లాంచ్డ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ (హెచ్.ఇ.ఎల్.ఐ.ఎన్.ఎ). దాని పూర్తి రేంజ్ ను ఆదివారం ప్రయోగించినట్టు రక్షణ శాఖ వెల్లడించింది. ప్రయోగం నిర్వహించిన డిఆర్డీవో, భారత ఆర్మీలను రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అభినందించారు. దేశ రక్షణ సామర్ధ్యం దీనితో మరింత పెరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ప్రపంచంలోని అత్యాధునిక యాంటీ ట్యాంకు ఆయుధాల్లో ‘హెలినా’ ఒకటి అని రక్షణ శాఖ వర్గాలు చెబుతున్నాయి.