అంగారకుడి అందం.. హబుల్ తాజా చిత్రం

25 0

హబుల్ టెలిస్కోప్ ఈ ఏడాది జూన్ 27వ తేదీన తీసిన జూపిటర్ చిత్రం ఇది. సౌర కుటుంబంలోని అతి పెద్ద గ్రహమైన అంగారకుడిపై ప్రత్యేకమైన ‘గ్రేట్ రెడ్ స్పాట్’ ఈ చిత్రంలో స్పష్టంగా కనిపిస్తోంది. అంగారకుడిపైన అతలాకుతలంగా ఉండే వాతావరణంలో మేఘాల కదలికలు హబుల్ వీడియోలో నిక్షిప్తమయ్యాయి. అంగారకుడి రంగులు, అవి మారే తీరు అధ్యయనం చేస్తున్నవారికి కొత్త క్లూలు అందిస్తున్నాయి.

అంగారకుడిపై గ్రేట్ రెడ్ స్పాట్ మన భూమి కంటే పెద్ద సైజులో ఉంటుంది. అయితే, 1800 సంవత్సరం నుంచి ఈ రెడట్ స్పాట్ పరిమాణం తగ్గడాన్ని శాస్త్రవేత్తలు గమనిస్తున్నారు. దానికి కారణాలేమిటో మాత్రం ఇంతవరకు నిర్ధారణ కాలేదు. అంగారకుడు భూమికి 40 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండగా హబుల్ వైడ్ ఫీల్డ్ కెమెరా 3 చిత్రాల్లో బంధించింది. ఆ సమయంలో అంగారక గ్రహం కచ్చితంగా సూర్యుడికి ఎదురుగా ఉంది.