టాప్ కంపెనీల్లోనే కొత్త ఉద్యోగాలకు కోత

admin

2016-17లో 45 శాతం తగ్గిన నియామకాలు

పెద్ద నోట్ల రద్దుతో చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో ఉపాధికి భారీగా కోత పడింది. అదే సమయంలో బడా పరిశ్రమలు బాగానే లాభాలను గడించాయి. అయితే, అక్కడా ఉద్యోగాలకు ఢోకా లేదనుకుంటే పొరపాటే. దేశంలోని అతి పెద్ద కంపెనీల్లో సైతం కొత్త నియామకాలకు భారీగా కోత పడింది. గత మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం (2016-17)లో నియామకాలు కిందటి ఏడాదికంటే ఏకంగా 45 శాతం తగ్గాయి.

బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బిఎస్ఇ)500 జాబితాలోని 241 కంపెనీల లెక్కలను పరిశీలించినప్పుడు దేశంలో ఉపాధి అవకాశాలు ఎంతగా మందగించాయో అర్ధమైంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఆయా కంపెనీలన్నిటిలో కలిపి కేవలం 66,000 నియామకాలు జరిగాయి. అంతకు ముందు సంవత్సరం..అంటే 2015-16లో 1,23,000 మంది ఉద్యోగులను ఆయా కంపెనీలు నియమించాయి.

2015-16 ఆర్థిక సంవత్సరం చివరికి.. అంటే 2016 మార్చినాటికి ఈ టాప్ 241 కంపెనీలలో పని చేేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్య 31.90 లక్షలు. అది 2017 మార్చినాటికి 32.50 లక్షలకు పెరిగింది. ఇటీవలి సంవత్సరాలలో ఇది అతి తక్కువ పెరుగుదల. బిఎస్ఇ 500లోని మిగిలిన కంపెనీల డేటా అందుబాటులోకి వస్తే ఉపాధి తగ్గుదలపై మరిన్ని వివరాలు వెల్లడవుతాయి.

Leave a Reply

Next Post

అహో సాహో...! ప్రభాస్ పుట్టిన రోజున కాపీ పోస్టర్ బహుమానం

ShareTweetLinkedInPinterestEmail’సాహో’రె బాహుబలి…! సంచలనం విజయం సాధించిన ’బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో. ఆ మూవీలో ప్రభాస్ ‘ఫస్ట్ లుక్’ను సోమవారం విడుదల చేశారు. అయితే, అది ఎంత మాత్రం ఫస్ట్ లుక్ లా లేదు. హాలీవుడ్ సినిమా బ్లేడ్ రన్నర్ 2049 పోస్టర్ కు అనుకరణలా కనిపిస్తోంది. అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ’ఫస్ట్ లుక్’ను విడుదల చేయనున్నట్టు సినిమా దర్శకుడు సుజీత్ ఆదివారమే […]

Subscribe US Now

shares