చంద్రబాబుకంటే మనవడి నెట్ వర్త్ ఎక్కువ

5 0

ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2011 నుంచి ఏటా ‘కుటుంబ ఆస్తులు’ ప్రకటిస్తున్నారు. గత రెండేళ్ళుగా ఆ పని కుటుంబం తరఫున ఆయన తనయుడు లోకేష్ చేపట్టారు. అందులో భాగంగానే శుక్రవారం మరోసారి ఆస్తుల ప్రకటన చేశారు. యధావిధిగా ఆస్తుల మార్కెట్ విలువను కాకుండా వాటి కొనుగోలు విలువను మదించారు. 2017 మార్చినాటికి  చంద్రబాబు కుటుంబం మొత్తానికి ఉన్న ఆస్తులు వాటి కొనుగోలు విలువ ప్రకారం రూ. 69.71 కోట్లు. ముఖ్యమంత్రి చంద్రబాబు,ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాంశ్ పేరిట ఉన్న మొత్తం ఆస్తుల ప్రాథమిక విలువ ఇంతేనని శుక్రవారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో లోకేష్ ప్రకటించారు.

ఐదుగురు సభ్యుల ఆ కుటుంబంలో అతి తక్కువ ఆస్తులున్నది ముఖ్యమంత్రి చంద్రబాబుకే కావడం విశేషం. ఆయన ఆస్తులు మనవడు దేవాంశ్ పేరిట ఉన్నవాటికంటే తక్కువ. చంద్రబాబు పేరిట మొత్తం రూ. 8.17 కోట్ల విలువైన ఆస్తులు ఉండగా అప్పులు 5.64 కోట్లు. నికర ఆస్తులు రూ. 2.53 కోట్లు. చంద్రబాబు మనవడు దేవాంశ్ నికర ఆస్తులు 11.54 కోట్లుగా చూపించారు. వాటిలో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లోని ఇల్లు (రూ. 9.18 కోట్లు), ఫిక్స్డ్ డిపాజిట్లు రూ. 2.30 కోట్లు ఉన్నాయి. చంద్రబాబుకంటే మనవడు దేవాంశ్ ఆస్తులు నాలుగున్నర రెట్లు అధికం. చంద్రబాబు కుటుంబంలో అప్పులు లేనిది ఒక్క దేవాంశ్ కే. అధిక ఆస్తులున్నది చంద్రబాబు భార్య భువనేశ్వరికి కాగా.. లోకేష్, ఆయన భార్య బ్రాహ్మణి ఆస్తులలో సమానంగా ఉన్నారు.

చంద్రబాబు ఆస్తులు, అప్పులు

మొత్తం ఆస్తులు 8.17 కోట్లు.. అప్పులు 5.64 కోట్లు

జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 65లో 1125 గజాల ప్లాటు విలువ రూ. 7.76 కోట్లు

నారావారిపల్లెలో నివాస సముదాయం (0.97 ఎకరం స్థలం) విలువ 23.84 లక్షలు

అంబాసడర్ కారు విలువ 1.52 లక్షలు

బ్యాంక్ ఆఫ్ బరోడా హౌసింగ్ లోన్ 5.64 కోట్లు..

భువనేశ్వరి ఆస్తులు అధికం (25.41 కోట్లు)

హెరిటేజ్ లో పెట్టుబడులు 19.95 కోట్లు...

నిర్వాణలో పెట్టుబడి 3.29 కోట్లు

ప్రావిడెంట్ ఫండ్ లో బ్యాలెన్స్ రెండు కోట్లు...

3,519 గ్రాముల ఆభరణాల విలువ 1.27 కోట్లు

ఆడి కారు 91.93 లక్షలు

ఇతర లిక్విడ్ అసెట్స్ 15.12 కోట్లు

మొత్తం ఆస్తులు 46.32 కోట్లు

రుణాలు, ఇతర పోబడి 20.90 కోట్లు

నికర ఆస్తులు 25.41 కోట్లు

లోకేష్ నికర ఆస్తులు 15.22 కోట్లు

జూబ్లీ హిల్స్ 65 రోడ్డులో ప్లాటు 10.11 కోట్లు

హెరిటేజ్ ఫుడ్స్ లో 2.52 కోట్లు పెట్టుబడి

నిర్వాణ హోల్డింగ్స్ లో 1.62 కోట్లు

ఫోర్డు కారు, రెండు బుల్లెట్ ప్రూఫ్ ఫార్చ్యూనర్లు 92.49 కోట్లు

ఇతర లిక్విడ్ అసెట్స్ 8.98 కోట్లు

సేవింగ్స్ అకౌంట్లలో బ్యాలన్స్ 1.84 లక్షలు

మొత్తం ఆస్తులు 26.39 కోట్లు

బ్యాంకు ఆఫ్ బరోడా హౌసింగ్ లోను 5.64 కోట్లు

ఇతర లోన్లు 5.47 కోట్లు

మొత్తం అప్పులు 11.17 కోట్లు

నికర ఆస్తులు 15.22 కోట్లు

బ్రాహ్మణి ఆస్తులు 15.01 కోట్లు

రిసీవబుల్స్ 7.36 కోట్లు

రోడ్డు నెంబర్ 19లో ఇల్లు 3.50 కోట్లు

మొత్తం ఆస్తులు 15.38 కోట్లు

అప్పులు 36.14 లక్షలు

నికర ఆస్తులు 15.01 కోట్లు

దేవాంశ్ ఆస్తులు 11.54 కోట్లు

రోడ్డు నెంబర్ 36లో ఇల్లు 9.18 కోట్లు (తాత బాలక్రిష్ణ బహుమతి)

పిఎన్ బి హౌసింగ్ ఫైనాన్స్ ఫిక్స్డ్ డిపాజిట్లు 2.30 కోట్లు

వెండి ఉయ్యాల 2.87 లక్షలు

బ్యాంకు అకౌంట్లలో బ్యాలన్స్, క్యాష్ 2.47 లక్షలు

మొత్తం ఆస్తులు 11.54 కోట్లు

జగన్ ఆస్తులను ఈడీ ప్రకటిస్తోంది...

ఆస్తుల మార్కెట్ విలువ ఎప్పటికప్పుడు మారుతుంటుంది కాబట్టి దాన్ని ప్రామాణికంగా తీసుకోవడంలేదని లోకేష్ చెప్పారు. తమ ఆస్తులు ప్రకటించాక విమర్శలు చేయడం పరిపాటి అయిందన్న లోకేష్... ’ముందు మీ ఆస్తులు ప్రకటించి ఆ తర్వాత విమర్శలు చేయండి’ అని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని సవాలు చేశారు. యావద్భారత దేశంలో ఏ రాజకీయ కుటుంబమూ చేయని విధంగా ఆస్తుల ప్రకటన చేస్తున్నామని, కుటుంబ ఆస్తులు ప్రకటించనివారు తమపై ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మరని లోకేష్ పేర్కొన్నారు. జగన్ ఆస్తులను సీబీఐ, ఈడీ ప్రకటిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ‘మీకు 2004కు ముందు ఎంత ఆస్తులు.. తర్వాత ఎంత? ఎక్కడినుంచి వచ్చాయి? ప్రకటించండి’

కుటుంబం రాజకీయాలపై ఆధారపడకూడదన్న ఉద్దేశంతో తన తండ్రి 1992లో హెరిటేజ్ సంస్థను ప్రారంభించారని, ఇప్పుడది రూ. 2,600 కోట్ల టర్నోవర్ కు చేరిందని లోకేష్ చెప్పారు. తాను 2008 నుంచి 2013 వరకు కంపెనీలో పని చేశానని, ఆ సమయంలోనే రూ. 600 కోట్ల నుంచి రూ. 1800 కోట్ల వరకు టర్నోవర్ పెరిగిందని తెలిపారు. తమది రైతులపై ఆధారపడిన వ్యాపారమన్న లోకేష్, ప్రభుత్వం నుంచి ఏమీ లబ్ది పొందడంలేదని ఉద్ఘాటించారు. జగన్ తండ్రి వైఎస్ సిఎంగా ఉన్నప్పుడు హెరిటేజ్ పై 17 కేసులు వేయించాని, కానీ ఒక్కటి కూడా రుజువు కాలేదని లోకేష్ వ్యాఖ్యాానించారు. ప్రస్తుతం హెరిటేజ్ సంస్థలో తమ కుటుంబానికి 50.60 శాతం వాటాలున్నాయని చెప్పారు.

Leave a Reply