స్టాక్ మార్కెట్ రికార్డు

10,243 పాయింట్ల వద్ద ముగిసిన నిఫ్టీ

సోమవారం స్టాక్ మార్కెట్లు కొత్త హైట్స్ చూశాయి. నిఫ్టీ 50 సూచీ మొదటిసారిగా 10,200 మార్కు దాటింది. 75 పాయింట్లు పెరిగి 10,243 పాయింట్లకు చేరింది. ఇండెక్స్ హెవీ వెయిట్లు ఎయిర్ టెల్, మహీంద్రా అండ్ మహీంద్రా లాభాలను నమోదు చేయడం కొత్త రికార్డుకు దోహదం చేసింది.

సెన్సెక్స్ 254 పాయింట్లు పెరిగి ఇంట్రా డే వాణిజ్యంలో 32,687 పాయింట్లకు చేరుకుంది. ఎయిర్ టెల్, ఫెడరల్ బ్యాంకు, భారత్ ఫైనాన్సియల్ ఇంక్లూజన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ బాగా లబ్ది పొందాయి.

 

Leave a Comment