6.2 శాతమే : ఇండియా వృద్ధి రేటుపై ‘మూడీస్’

29 0

దేశంలో అనేక రంగాల్లో అమ్మకాలు క్షీణించాయని వార్తలు రోజూ వస్తున్న నేపథ్యంలో స్థూల దేశీయోత్పత్తి (జి.డి.పి)పై షాకింగ్ వార్త. 2019 కేలండర్ సంవత్సరంలో భారత జీడీపీ కేవలం 6.2 శాతం పెరుగుతుందని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ తాజా అంచనాలో పేర్కొంది. ఇంతకు ముందు తానే వేసిన అంచనా (6.8 శాతం) నుంచి గణనీయంగా తగ్గించడం గమనార్హం.

2020 కేలండర్ సంవత్సరంలోనూ తన అంచనాను తగ్గించిన ‘మూడీస్’, వచ్చే ఏడాది జీడీపీ వృద్ధి రేటు 6.7 శాతంగా ఉండగలదని పేర్కొంది. బలహీనంగా ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆసియా ఎగుమతులను ప్రభావితం చేసిందని, అనిశ్చిత వాతావరణంతో పెట్టుబడులు తగ్గిపోయాయని ‘మూడీస్’ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.