అయ్యన్నపై గూఢచర్యం!

admin
సోదరుడి కారులో వాయిస్ రికార్డర్

ఆంధ్రప్రదేశ్ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుపై ఎవరైనా నిఘా పెట్టారా? ఆయనకు సంబంధించిన ఓ కారులో వాయిస్ రికార్డర్ దొరకడంతో ఈ అనుమానం రేకెత్తింది. ఆ కారును ఆయ్యన్నపాత్రుడు సోదరుడు సన్యాసిపాత్రుడు ఉపయోగిస్తున్నారు. మంత్రి ఇంటి ఆవరణలో ఉండే కారులోనే వాయిస్ రికార్డర్ అమర్చారు. ఆ వాయిస్ రికార్డర్లో కేవలం కారులో మాట్లాడుకున్న మాటలే కాకుండా ఇంట్లో సంభాషణలు కూడా రికార్డు కావడంతో అయ్యన్న కుటుంబం షాకైంది.

సన్యాసిపాత్రుడు ఫిర్యాదుమేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వాయిస్ రికార్డును స్వాధీనం చేసుకొని ఎక్కడెక్కడి సంభాషణలు నమోదయ్యాయో పరిశీలించారు. ఇంట్లో కూడా మైక్రోఫోన్లను అమర్చినట్టు ప్రాథమిక సమాచారం. ముఖ్యంగా అయ్యన్న సమావేశ మందిరంలో మాట్లాడిన విషయాలు కూడా కారులో దొరికిన వాయిస్ రికార్డర్లో నిక్షిప్తమై ఉన్నట్టు చెబుతున్నారు. దీనిపై అనేక అనుమానాలు వస్తున్నాయి. ఆ ఇంట్లో తిరుగాడేవారి సహకారం లేకుండా నిఘా పరికరాలు అమర్చడం అసాధ్యమని పోలీసులు భావిస్తున్నారు.

అయ్యన్నపాత్రుడు సోదరుడు, నర్సీపట్నం మున్సిపల్ వైస్ ఛైర్మన్ అయిన సన్యాసి పాత్రుడు చెబుతున్న సమాచారాన్ని బట్టి ఈ నెల 28వ తేదీన కారులో వాయిస్ రికార్డర్ ను గుర్తించారు. విశాఖలో బంధువుల ఇంటికి వెళ్ళిన సందర్భంలో కారులో ఉన్న సామాగ్రిని దించేశాక డ్రైవర్ ఈ వాయిస్ రికార్డును గుర్తించారు. మంత్రి ఇంట్లో, సోదరుడి కారులో నిఘా పరికరాలను ఎవరు అమర్చారన్నది పోలీసులు తేల్చాల్సి ఉంది.

మంత్రి అయ్యన్నపాత్రుడుకు మావోయిస్టులనుంచి ముప్పు పొంచి ఉంది. నిఘాకు ఈ నేపథ్యం కారణమా లేక రాజకీయ, వ్యక్తిగత వైరాలేమైనా ఇందుకు దారితీశాయా? దర్యాప్తులో తేాలాలి.

Leave a Reply

Next Post

పసిఫిక్ సముద్రంలో భారీ భూకంపం... తీవ్రత 6.8

ShareTweetLinkedInPinterestEmailదక్షిణ పసిఫిక్ సముద్రంలో మంగళవారం తెల్లవారు జామున భారీ భూకంపం సంభవించింది. ఫ్రెంచ్ టెరిటరీ న్యూ కేలెడోనియాలోని టాడైన్ పట్టణానికి తూర్పు దిశగా 126 కిలోమీటర్ల దూరంలో సంభవించిన ఈ భూ కంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. భూకంప కేంద్ర బిందువు సముద్ర మట్టానికి 16.7 కిలోమీటర్ల లోతున ఉన్నట్టు అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థ కనుగొంది. అయితే, ఈ భూకంపం వల్ల సునామీ వచ్చే అవకాశం లేదని […]

Subscribe US Now

shares