అయోవాలో మంత్రి సోమిరెడ్డి

1 0
Read Time:1 Minute, 21 Second
కర్నూలు మెగా సీడ్ పార్కు పురోగతిపై చర్చ

కర్నూలు జిల్లాలో ఇటీవల శంకుస్థాపన జరిగిన మెగా విత్తన పార్క్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. విదేశీ పర్యటనలో ఉన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి… అయోావా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రితోనూ, ఈ పార్క్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన అయోవా విశ్వవిద్యాలయం అధికారులతోనూ సమావేశమయ్యారు.

అవగాహనా ఒప్పందానికి అనుగుణంగా చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. కర్నూలు విత్తన పార్క్ ఏర్పాటులో భాగస్వాముల పాత్ర పై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. అయోవా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి బిల్ నోర్తే, ఉప మంత్రి మైఖెల్ నైగ్, విశ్వవిద్యాలయానికి చెందిన దామోదర్ నాయుడు, దిలీప్ కుమార్, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ హరిజవహర్ లాల్ సమావేశంలో ఉన్నారు.

 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply