ఒకే ఇండియన్… 2017లో నాలుగో సూపర్ సిరీస్ శ్రీకాంత్ సొంతం

1 0
Read Time:2 Minute, 53 Second
ఈ సంవత్సరం కిడాంబికిది నాలుగో టైటిల్
మరే ఇండియన్ సాధించని ఘనత!

భారత బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ ఈ ఏడాది విజయాల పరంపరను కొనసాగిస్తున్నాడు. తాజాగా ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ సొంతం చేసుకున్నాడు. శ్రీకాంత్ కు 2017లో ఇది నాలుగో టైటిల్. ఆదివారం పారిస్ లో జరిగిన ఫైనల్ లో జపాన్ ఆటగాడు కెంటా నిషిమోటోను వరుస గేమ్ లలో 21-14, 21-13 స్కోరుతో ఓడించి టైటిల్ సొంతం చేసుకున్నాడు శ్రీకాంత్. ఈ ఆట 34 నిమిషాల్లో ముగిసింది.

గుంటూరుకు చెందిన శ్రీకాంత్ భారత బ్యాడ్మింట్ ధిగ్గజం పుల్లెల గోపీచంద్ శిష్యుడు. తన కెరీర్లో ఫ్రెంచ్ ఓపెన్ తో కలిపి మొత్తం ఆరు టైటిల్స్ సొంతం చేసుకున్నాడు శ్రీకాంత్. అందులో నాలుగు ఈ ఏడాది సాధించినవే. కొద్ది రోజుల క్రితమే డెన్మార్క్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్నాడు. అంతకు ముందు ఇండోనేషియా, ఆస్ట్రేలియా టైటిళ్ళనూ సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన సింగపూర్ ఓపెన్ లో శ్రీకాాంత్ రన్నరప్ గా నిలిచాడు. అక్కడ శ్రీకాంత్ పై అతని స్నేహితుడు సాయి ప్రణీత్ విజయం సాధించాడు.

సింగపూర్ ఓపెన్ టైటిల్ మిస్సయిన తర్వాత పట్టుదలతో ఆడిన శ్రీకాంత్ ఈ ఏడాది ఏకంగా నాలుగు టైటిళ్ళను సాధించారు. ప్రపంచ ర్యాంకుల్లో నాలుగో స్థానంలో ఉన్న శ్రీకాంత్ ఈ ఏడాది ఆడిన మ్యాచులలో 37 (82 శాతం) గెలిచి తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ లో శ్రీకాంత్ తో తలపడిన జపాన్ ఆటగాడు 40వ ర్యాంకర్. అయితే, ఫస్ట్ రౌండ్ లో మలేషియా ధిగ్గజ ఆటగాడు లీ చోంగ్ ను ఓడించి సంచలనానికి కారణమయ్యాడు.

ఒక కేలండర్ సంవత్సరంలో నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్ళను సొంతం చేసుకున్న నలుగురు పురుషుల్లో ఒకరిగా శ్రీకాంత్ ఖ్యాతి గడించాడు. ఈ ఘనతను సొంతం చేసుకున్న ఏకైక ఇండియన్ శ్రీకాంత్. వరుస విజయాల శ్రీకాంత్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందనలు తెలిపారు.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply