100 హిప్పోలను మింగిన ఆంత్రాంక్స్

నమీబియా నేషనల్ పార్కులో కళేబరాల కుప్ప హిప్పోపోటమస్.. అంతరించిపోయే ప్రమాదం ఎదుర్కొంటున్న జీవజాలంలో ఒకటి. వాటి సంరక్షణకోసం ప్రపంచ దేశాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. అలాంటి హిప్పోలు 100కు పైగా ఒకేచోట మరణిస్తే… మనసును కలసివేసే ఈ పరిణామానికి నమీబియా నేషనల్ పార్కు కేంద్ర బిందువైంది. హిప్పోల మరణానికి కారణం ఏమిటన్నది అధికార వర్గాలు నిర్ధారించలేకపోయాయి. అయితే, వ్యాధి లక్షణాలను బట్టి అది ’ఆంత్రాక్స్’గా భావిస్తున్నారు. ఈ నెల ఒకటో తేదీన తొలి మరణం సంభవించగా…రెండు వారాల్లోపే మరణించిన హిప్పోల సంఖ్య 109కి చేరింది. ఈ మరణాలకు ముందు నమీబియాలో 1,400 వరకు హిప్పోలు ఉన్నాయి. మరో విషాధమేమిటంటే… మరణాలకు కచ్చితమైన కారణం కనిపెట్టేవరకు పూర్తి స్థాయిలో నివారణ చర్యలు చేపట్టలేకపోవడం. హిప్పోలతోపాటు కొన్ని వాటర్ బఫెలోస్ కూడా మరణించాయి. జంతు కళేబరాలు నమీబియా నేషనల్ పార్కులో చెల్లాచెదరుగా పడి…

Read More