పేద బీసీలకు పెళ్ళి కానుక, ప్రవాసాంధ్రులకో సంక్షేమ విధానం… మంత్రివర్గ నిర్ణయాలు

చంద్రన్న పెళ్ళి కానుక కింద పేద బీసీ జంటలకు రూ. 30 వేలు 201718లో 40 వేల పెళ్ళిళ్ళకు రూ. 120 కోట్లు అవసరం రెండేళ్ళ తర్వాత ’టెన్త్ తప్పనిసరి’ నిబంధన మంత్రివర్గ సమావేశంలో విధానానికి ఆమోదం పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖల్లో ’ఔట్ సోర్సింగ్’! ఎంతమంది అవసరమో గుర్తించాలన్న సిఎం రాష్ట్రంలోని బలహీనవర్గాల యువతీ యువకులకు పెళ్ళి సమయంలో రూ. 30 వేల రూపాయలు కానుకగా ఇవ్వాలన్న కొత్త పథకానికి మంగళవారం మంత్రిమండలి ఆమోదం తెలిపింది. పేద బీసీలలో పెళ్ళికి చట్టబద్ధంగా నిర్దేశించిన వయసు (పురుషులైతే 21 సంవత్సరాలు… మహిళలైతే 18 సంవత్సరాలు) దాటినవారికి ’చంద్రన్న పెళ్ళి కానుక’ పేరిట ఈ మొత్తాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. 2018 జనవరి నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న బలహీనవర్గాల యువతీయువకులు…

Read More