పెట్టుబడులే లక్ష్యంగా… ఏపీ మంత్రివర్గం భూ కేటాయింపులు (మొత్తం జాబితా)

మంగళవారంనాటి మంత్రివర్గం కేటాయించిన భూములు వివరాలివి… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వం భూ కేటాయింపులు చేస్తోంది. తాజాగా మంగళవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలోనూ ఇదే రిపీటైంది. పెద్ద మొత్తంలో చేసిన భూ కేటాయింపులలో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఎపిఐఐసి) సింహభాగం పొందింది. దీనికి తోడు రాజధాని అమరావతి పరిధిలో 6 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 39 వేల కోట్ల) పెట్టుబడి ప్రతిపాదనలతో వచ్చిన వివిధ సంస్థలకు చేసిన భూ కేటాయింపులను కూడా మంత్రివర్గం ఆమోదించింది. అమరావతిలో భూములు కేటాయించిన సంస్థలలో గోపిచంద్ బ్యాట్మింటన్ అకాడమీ, బ్రహ్మకుమారీ సొసైటీ, నందమూరి బసవ తారక రామారావు మెమోరియల్ కేన్సర్ ఫౌండేషన్, జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ (XLRI), LV ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌ ఉన్నాయి. కొత్తగా భూముల కేటాయింపు, ఇతర ప్రతిపాదనలపై మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలివి. కొత్తగా కేటాయింపులు…

Read More