2020 టి20 ప్రపంచ కప్ షెడ్యూళ్లివే

పురుషుల, మహిళల టోర్నీలు ఆస్ట్రేలియాలోనే.. ఇండియా మహిళల తొలి పోటీ ఆస్ట్రేలియాతో… పురుషుల టి20 తొలి మ్యాచ్ దక్షిణాఫ్రికాతో… 2020లో ఆస్ట్రేలియాలో జరగనున్న టి20 ప్రపంచ కప్ టోర్నీల షెడ్యూలును ఐసీసీ మంగళవారం విడుదల చేసింది. పురుషుల, మహిళల టి20 ప్రపంచ కప్ పోటీలు ఈసారి ఒకే ఏడాది ఒకే దేశంలో జరగడం విశేషం. ముందుగా మహిళల టి20 టోర్నీ 2020 ఫిబ్రవరి 21వ తేదీనుంచి మార్చి 8వ తేదీ వరకు జరగనుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన ఫైనల్ మ్యాచ్ ఏర్పాటు చేశారు. పురుషుల టి20 ప్రపంచ కప్ పోటీలు అక్టోబర్ 18న ప్రారంభమై నవంబర్ 15న ముగియనుంది. అక్టోబర్ 18 నుంచి 23 వరకు క్వాలిఫయర్ మ్యాచులు, ఆ తర్వాత గ్రూప్ మ్యాచులు ఉంటాయి. ఫైనల్ మ్యాచ్ నవంబర్ 15న జరుగుతుంది. మహిళల టోర్నీలో ఇండియా…

Read More