29న అయోధ్య కేసు హియరింగ్ రద్దు

జస్టిస్ ఎస్.ఎ. బాబ్డే అందుబాటులో ఉండటంలేదని… రాజ్యాంగ ధర్మాసనం సిటింగ్ రద్దు అయోధ్య భూమి హక్కుల వివాదంపై విచారణకు ఏర్పాటైన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 29వ తేదీన చేపట్టాల్సిన హియరింగ్ రద్దయింది. ఈమేరకు సుప్రీంకోర్టు ఆదివారం ఒక నోటీసు జారీ చేసింది. రాజ్యాంగ ధర్మాసనంలోని ఐదుగురు జడ్జిలలో ఒకరైన జస్టిస్ ఎస్.ఎ. బాబ్డే ఆ రోజు అందుబాటులో ఉండటంలేదు కాబట్టి విచారణ చేపట్టడంలేదని ఆ నోటీసులో పేర్కొన్నారు. బాబ్రీ మసీదు-రామజన్మభూమి వివాదంలో విచారణకోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సారథ్యంలో ఇంతకు ముందు ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనంలో… ఇద్దరు జడ్జిలు ఇటీవలే మారారు. తాజా ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్ఎ బాబ్డే, జస్టిస్ డివై చంద్రచూడ్ లతో పాటు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉన్నారు. ‘‘ఇస్లాంలో… మసీదులో ప్రార్ధన…

Read More