ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 25వ తేదీవరకు నిర్వహించాలని నిర్ణయించారు. శుక్రవారం వెలగపూడిలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభా కార్యకలాపాల సలహా కమిటీ (బిఎసి) ఈ సందర్భంగా సమావేశమై 10 పని దినాలపాటు సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. బిఎసి నిర్ణయం ప్రకారం 11, 12, 16, 17, 18, 19 తేదీల్లో అసెంబ్లీకి సెలవులు ఉంటాయి. ఆయా రోజులను మినహాయించి 25వ తేదీవరకు సభను నిర్వహిస్తారు. శుక్రవారం సమావేశాలు ప్రారంభం కాగా మధ్యాహ్నం వరకు నిర్వహించి తిరిగి సోమవారానికి స్పీకర్ వాయిదా వేశారు. కాగా, ప్రతిపక్షం ఈ సమావేశాలకు హాజరు కాకపోవడంతో అధికార పక్షం (టిడిపి+బిజెపి) ఒక్కటే సభలో పాల్గొంది. 10 పని దినాల్లో 27 అంశాలను వివిధ రూపాల్లో చర్చకు చేపట్టాలని బిఎసిలో నిర్ణయించారు. మరోవైపు శాసన మండలి బిఎసి కూడా సమావేశమై…
Read More