ఒక కేలండర్ సంవత్సరంలో నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్ళను గెలుచుకున్న ఏకైక ఇండియన్ బ్యాడ్మింటన్ ఆటగాడిగా రికార్డులకెక్కిన కిడాంబి శ్రీకాంత్ ప్రపంచ ర్యాంకింగ్ లోనూ తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నాడు. తాజాగా ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బిడబ్ల్యుఎఫ్) ప్రకటించిన ర్యాంకుల ప్రకారం పురుషుల సింగిల్స్ విభాగంలో శ్రీకాంత్ ది రెండో స్థానం. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకిన శ్రీకాంత్ నాలుగో ర్యాంకునుంచి రెండో స్థానానికి చేరుకున్నాడు. బిడబ్ల్యుఎఫ్ టాప్ 10 ర్యాంకర్లలో ఒకే ఒక్క ఇండియన్ శ్రీకాంత్. మహిళల సింగిల్స్ ర్యాంకుల్లో రాష్ట్రానికే చెందిన పీవీ సింధు ఇదివరకే రెండో స్థానంలో ఉండగా ఇప్పుడు పురుషుల సింగిల్స్ లోనూ అదే ఘనత ఆంధ్రుడికి దక్కింది. డెన్మార్క్ దేశానికి చెందిన విక్టర్ ఎక్సెల్సెన్ 77,930 పాయింట్లతో ప్రపంచ ర్యాంకులలో మొదటి స్థానంలో ఉండగా శ్రీకాంత్ 73,403 పాయింట్లతో అతని తర్వాత స్థానానికి…
Read More