శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించకుండా మహిళలను నిరోధించడం రాజ్యాంగం వారికి కల్పించిన హక్కులను భంగపరచడమేనా? సాక్షాత్తు సుప్రీంకోర్టు లేవనెత్తిన ప్రశ్నఇది. మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధం విషయంలో జరుగుతున్న విచారణ దీంతో కొత్త మలుపు తిరిగింది. ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగిస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ఆధ్వర్యంలోని ముగ్గురు జడ్జిల ధర్మాసనం ఈ కేసు విషయంలో పలు కీలక ప్రశ్నలను లేవనెత్తింది. దేవస్థానం మహిళల ప్రవేశాన్ని నిషేధించగలదా? ఆ నిషేధం రాజ్యాంగం మహిళలకు కల్పించిన హక్కులకు భంగం కలిగిస్తుందా? ఇలాంటి సంప్రదాయం మహిళల పట్ల వివక్ష వహించడమేనా? అన్న ప్రశ్నలకు రాజ్యాంగ ధర్మాసనం పరిష్కారం సూచించవలసి ఉంది. శుక్రవారం నాటి నిర్ణయానికి చాలా ముందుగా గత ఫిబ్రవరి 20న సుప్రీంకోర్టు… ఈ అంశాన్ని రాజ్యాంగ…
Read More