‘పార్లే’ నుంచి 10,000 ఉద్యోగాలు పోతున్నాయ్!

ఇండియాలో బిస్కట్ తయారీదారుల్లో దిగ్గజం పార్లే ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడా కంపెనీ బిస్కట్ల అమ్మకాలు తగ్గిపోవడంతో ఏకంగా 10 వేల మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్టు ఓ అధికారి బుధవారం చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పడిపోవడంతో ఉత్పత్తిని తగ్గించినట్టు ఆయన చెప్పారు.ఆసియాలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన ఇండియాలో ఇప్పుడు పలు రంగాలు తిరోగమనంలో ఉన్నాయి. కార్ల నుంచి దుస్తులవరకు అమ్మకాలు పడిపోయాయి. కంపెనీలు ఉత్పత్తి తగ్గించుకొని ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి. ఆయా రంగాలకు సంబంధించిన ప్రముఖులు ప్రభుత్వం నుంచి ఉద్ధీపన పథకాలను ఆశిస్తున్నాయి.పార్లే కంపెనీ కేటగరి హెడ్ మయాంక్ షా శుక్రవారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ కంపెనీ కష్టాన్ని ఏకరవు పెట్టారు. పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఆయన చెబుతున్నారు. ‘‘బిస్కట్ల అమ్మకాలు వేగంగా పడిపోయాయి. దీంతో ఉత్పత్తిని తగ్గించుకోక…

Read More