విషాధ ఆదివారం… కృష్ణలో బోటు మునిగి 16 మంది మృతి

ఆనంద ఆంధ్రప్రదేశ్ సాధన లక్ష్యాన్ని చాటుతూ ప్రభుత్వం ‘ఆనంద ఆదివారం’ కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న చోటనే మహావిషాధం చోటు చేసుకుంది. కృష్ణమ్మకు నిత్యహారతులిచ్చే ప్రదేశంలోనే విహారయాత్రికులు జలసమాధి అయ్యారు. రాష్ట్ర రాజధాని ప్రాంతంలోని ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా నదిలో ఆదివారం ఓ ప్రైవేటు బోటు నీట మునిగి 16 మంది మృత్యువాత పడ్డారు. మృతులంతా ప్రకాశం జిల్లాకు చెందినవారు. ఒంగోలు వాకర్స్ క్లబ్ నుంచి సుమారు 60 మంది విహారంకోసం విజయవాడ వచ్చారు. ఆదివారం సాయంత్రం వారంతా విజయవాడలోని పున్నమి ఘాట్ నుంచి ఎగువ ప్రాంతంలోని ఇబ్రహీంపట్నంవద్ద ఉన్న పవిత్ర సంగమం వరకు బోటులో వెళ్ళాలనుకున్నారు. టూరిజం బోటులో వెళ్ళడానికి వారు ప్రయత్నించినప్పుడు.. సిబ్బంది సమయం మించిపోయిందని చెప్పి నిరాకరించారు. దీంతో వారిలో 32 మంది రివర్ బోటింగ్ అండ్ అడ్వంచర్స్ అనే ప్రైవేటు సంస్థ బోటు ఎక్కారు. పవిత్ర సంగమం సమీపానికి వెళ్ళాక ప్రమాదం…

Read More