అస్సాం ఫారెనర్స్ ట్రిబ్యునళ్ల గుడ్డి తీర్పులకు మరో ఉదాహరణ ఇది. బి.ఎస్.ఎఫ్. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ముజిబుర్ రెహ్మాన్, ఆయన భార్య విదేశీయులని తేల్చింది ఆ రాష్ట్రంలోని జోర్హాట్ పట్టణంలోని ట్రిబ్యునల్. రెహ్మాన్ ప్రస్తుతం బిఎస్ఎఫ్ లో పంజాబ్ రాష్ట్రంలో పని చేస్తున్నారు. జూలై చివరి వారంలో ఆయన సెలవుపై అస్సాం వచ్చినప్పుడు ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయారు.1923 నుంచి భూమి డాక్యుమెంట్లు ఉన్న తనలాంటి ఒక నిజమైన భారతీయుడిని ఓ తాగుబోతు సాక్ష్యం ఆధారంగా విదేశీయుడిగా ప్రకటించడం దారుణమని రెహ్మాన్ ఆవేదన వ్యక్తం చేశారు. అస్సాం పోలీసు శాఖలోని సరిహద్దు విభాగం ట్రిబ్యునల్ కు సమర్పించిన నివేదికకు ఓ తాగుబోతు వాంగ్మూలమే ఆధారమని రెహ్మాన్ చెబుతున్నారు. ఈ సరిహద్దు విభాగం ప్రధానంగా పాకిస్తాన్ నుంచి చొరబాట్లను నిరోధించడానికి 1962లో ఏర్పాటైంది. ఈ విభాగం ఆధారంగా అస్సాంలోని…
Read More