పెప్సి, పతంజలి, ఐటీసీలతో పెట్టుబడి ఒప్పందాలు

వరల్డ్ ఫుడ్ ఇండియా సమ్మట్ లో ఆహార, రిటైల్ దిగ్గజాలు భారీ పెట్టుబడి ప్రతిపాదనలతో ముందుకొచ్చాయి. శనివారం డిల్లీలో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పెప్సి, కోకకోలా, అమేజాన్ వంటి ప్రపంచవ్యాప్త సంస్థలతోపాటు పతంజలి, ఐటీసీ వంటి దేశీయ దిగ్గజాలు పాల్గొన్నాయి. సుమారు రూ. 60 వేల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అందులో పెప్సి కంపెనీ అత్యధికంగా రూ. 13,340 కోట్ల పెట్టుబడికి  హామీ ఇవ్వగా.. దాని ప్రత్యర్ధి కోక కోలా రూ. 11,000 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం ఒప్పందాలలో 13 ఇదివరకే పెట్టుబడి హామీలు ఇచ్చిన సంస్థలకు సంబంధించినవి. పెప్సి ఇండియాలో రూ. 35 వేల కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్టు ఇదివరకే ప్రకటించింది. ఇప్పుడు ఎంఒయు కుదుర్చుకున్న మొత్తం అప్పటి ప్రకటనలో భాగమే. వ్యవసాయ సంబంధిత పరిశ్రమల్లో భాగస్వములతో కలసి రూ.11…

Read More