ఉన్నత స్థానాల్లో నిజాయితీ కావాలి

కేవీ చౌదరి ఉద్యోగ జీవితం ఆదర్శప్రాయం.. రామినేని ఫౌండేషన్ పురస్కార ప్రదాన సభలో సిఎం. ఉన్నత స్థానాలలో ఉన్నవారు క్రమశిక్షణ, నిజాయితీతో ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నాారా చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరిని ఉదహరిస్తూ… ఆయన ఉద్యోగ జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని ముఖ్యమంత్రి అన్నారు. తప్పు చేస్తే సొంత కుటుంబ సభ్యులను కూడా విడిచిపెట్టని తత్వం ఆయనదని ప్రశంసించారు. విజయవాడ ఎ కన్వెన్షన్ సెంటర్‌లో గురువారం ఉదయం జరిగిన రామినేని ఫౌండేషన్ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖ్య అతిధిగా పాల్గొని ప్రధాన ప్రసంగం చేశారు. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌తో కలిసి పురస్కార గ్రహీతలను సత్కరించారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరికి ముఖ్యమంత్రి విశిష్ఠ పురస్కారాన్ని అందించారు. హైదరాబాద్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ గీతా…

Read More