అమరావతి, విశాఖ, తిరుపతి నగరాలు దుబాయ్‌కి అనుసంధానం ఎమిరేట్స్, ఫ్లై దుబాయ్ ఎగ్జిక్యూటివ్‌లతో సీఎం భేటీ ఆంధ్రప్రదేశ్‌ను ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ హబ్‌గా చేసుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమిరేట్స్ విమానయాన సంస్థలకు సూచించారు. ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమిరేట్స్ స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ ఇంచార్జ్ అద్నాన్ ఖాజిమ్, ఫ్లై దుబాయ్ సీఈఓ ఘయిత్ అల్ ఘయిత్ లతో సమావేశమయ్యారు. ఎయిర్ క్రాఫ్ట్ మెయింటనెన్సు, రిపేర్, ఓవర్ హల్ సదుపాయాలను కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్‌లో అవసరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఒక విమానాశ్రయాన్ని నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా మధ్య ప్రాచ్య, దక్షిణాసియాలకు మధ్యలో ఉందని చంద్రబాబు చెప్పారు. అమరావతి, విశాఖ, తిరుపతి నగరాలను దుబాయ్ కి అనుసంధానం చేయవచ్చని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ను ఎమిరేట్స్ హబ్‌గా తీర్చిదిద్దటం ద్వారా ఉభయ దేశాల స్నేహబంధం…
Read More