పారడైజ్ పేపర్లలో జగన్మోహన్ రెడ్డి పేరు

పన్ను ఎగవేత ద్వారా సొమ్ము దాచుకోవడానికి స్వర్గధామాలుగా భావించే దేశాలు, దీవుల్లో జరుగుతున్న లావాదేవీల రహస్యాలను ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుల అంతర్జాతీయ కన్షార్షియం (ఐసిఐజె) మరోసారి బద్ధలు కొట్టింది. తాజాగా ‘పారడైజ్ పేపర్ల’ పేరిట ఏకంగా కోటీ 34 లక్షల రికార్డులను బహిర్గతం చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుయాయులనుంచి బ్రిటన్ రాణి వరకు ప్రపంచ స్థాయి నేతల పేర్లు అందులో ఉన్నాయి. ఇండియాకు సంబంధించినంతవరకు 714 పేర్లు ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పేరు అందులో చోటు చేసుకుంది. సన్ గ్రూపునుంచి మన రాష్ట్రానికే చెందిన జీఎంఆర్ వరకు ఆఫ్ షోర్ స్వర్గధామాల్లో లావాదేవీలు నెరిపినట్టు ఐసిఐజె తేల్చింది. పారడైజ్ పేపర్లలో పేర్లున్న ఇండియన్లు చాలావరకు కార్పొరేట్లు, కంపెనీల ముఖ్యులే. వారిలో కొంతమంది ఇప్పటికే సెంట్రల్ బ్యూరో ఆఫ్…

Read More