కరెస్పాండెన్స్ ఇంజనీరింగ్ డిగ్రీలు రద్దు.. సుప్రీం సంచలన తీర్పు

2001 తర్వాత డీమ్డ్ యూనివర్శిటీలు ఆఫర్ చేసిన కరెస్పాండెన్స్ కోర్సుల ద్వారా పొందిన ఇంజనీరింగ్ డిగ్గీలు చెల్లవని సుప్రీంకోర్టు శుక్రవారం ప్రకటించింది. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) గానీ, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఎఐసిటిఇ) గానీ ఇంజనీరింగ్ విద్యలో దూర విద్యా కార్యక్రమాలకు అనుమతి ఇవ్వలేదని గుర్తు చేసిన సుప్రీంకోర్టు, ఈ విషయంలో దూర విద్యా మండలి (డిఇసి) మంజూరు చేసిన అనుమతులు చెల్లవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు… ఇంజనీరింగ్ విద్యలో దూర విద్యా కోర్సులకు అనుమతి ఇచ్చిన అధికారులపై సీబీఐ విచారణకు ఆదేశించింది. జస్టిస్ ఎకె గోయల్, యుయు లలిత్ లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఎఐసిటిఇ నిరాకరించినా 2001నుంచి కరెస్పాండెన్స్ ద్వారా ఇంజనీరింగ్ కోర్సులు ఆఫర్ చేస్తున్న నాలుగు వర్శిటీలపై నమోదైన కేసులను సుప్రీంకోర్టు విచారణకు చేపట్టింది. రాజస్థాన్…

Read More