గురువారంభం వాయిదా! నవంబర్ 6 నుంచి జగన్ పాదయాత్ర

నవంబర్ 2. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించవలసిన రోజు. తెల్లవారితే శుక్రవారం. గురువారం ఆరంభిస్తే మరుసటి రోజే బ్రేకు వేసి… కోర్టుకు హాజరు కాక తప్పని పరిస్థితి. ఈ అనివార్యత రీత్యా జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర ప్రారంభ తేదీని మార్చారు. గురువారానికి బదులు తర్వాత వచ్చే సోమవారం (6వ తేదీన) పాదయాత్రను ప్రారంభించాలని తాజాగా నిర్ణయించారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర వాయిదా పడటం ఇదే మొదటిసారి కాదు. అయితే, ఈసారి వాయిదా కోర్టు తీర్పు నేపథ్యంలో అనివార్యమైంది. వచ్చే ఎన్నికలకోసం పార్టీని సమాయత్తం చేయడం, ప్రజల్లో ఆదరణ పెంచుకోవడం లక్ష్యాలుగా జగన్మోహన్ రెడ్డి ఆర్నెల్ల పాటు పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. ఇడుపుల పాయలోని తమ వ్యవసాయ క్షేత్రంలో తండ్రి సమాధినుంచి మొదలుపెట్టి ఇఛ్చాపురం వరకు పాదయాత్ర చేయాలని జగన్ సంకల్పించారు.…

Read More