హంగర్ ఇండెక్స్ లో ఉత్తర కొరియా, బంగ్లాదేశ్ కంటే ఘోరం

సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్… రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే బ్రదరూ… స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళిలాంటిదే బ్రదర్… 36 సంవత్సరాల క్రితం మహానటుడు కమల్ హాసన్ అభినయించిన అద్భుతమైన పాట ఇది. సినిమా పేరు ఆకలి రాజ్యం… ఇన్నేళ్ళ తర్వాత ఇండియా పరిస్థతికి అదే టైటిల్ సూటవుతోందంటే అతిశయోక్తి కాదేమో…! అంతర్జాతీయ ఆకలి ర్యాంకుల్లో ఈ ఏడాది సెంచురీ (100వ స్థానం) కొట్టంది ఇండియా. గురువారం వెల్లడైన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రిపోర్టు ప్రకారం… మునుపటి కంటే భారతదేశం మూడు స్థానాలు దిగజారింది. అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధనా సంస్థ (ఐఎఫ్ పిఆర్ఐ)  రూపొందించిన హంగర్ ఇండెక్స్ 2017లో 119 దేశాలకు ర్యాంకులు కేటాయించగా అందులో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం 100వ స్థానాన్ని పొందింది. ఆసియాలో మూడో అతి…

Read More