ట్రంప్ ఓ మూర్ఖుడు : నోబెల్ శాంతి బహుమతి విజేత!

3 0
Read Time:2 Minute, 46 Second
  • ’ఐకెన్’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫిన్ అభిప్రాయమిది..
  • నోబెల్ ప్రకటనకు రెండు రోజుల ముందు ట్వీట్..

’ట్రంప్ ఓ మూర్ఖుడు’… ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ ఎగనెస్ట్ న్యూక్లియర్ వెపన్స్ (ఐకెన్) సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీట్రైస్ ఫిన్ అభిప్రాయమిది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు కొత్తేమీ కాదు. ట్రంప్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న రోజులనుంచీ ఇప్పటివరకు అనేక మంది ఇదే విధమైన అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఇక్కడ ఫిన్ వ్యాఖ్యలో విశేషం ఏమంటే… ఆమె ముఖ్యపాత్ర పోషిస్తున్న ’ఐకెన్’ 2017 నోబెల్ శాంతి బహుమతిని పొందడమే! నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించడానికి సరిగ్గా రెండు రోజుల క్రితం ట్రంప్ పైన ఫిన్ ఈ వ్యాఖ్యతో ట్వీట్ చేశారు. ఇప్పుడది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

నోబెల్ బహుమతి విజేత ట్రంప్ ను మూర్ఖుడిగా అభివర్ణించినట్టు కొన్ని వార్తా సంస్థలు రాయగా… ట్విట్టర్లో చాలా మంది అదే విధంగా స్పందించారు. ’ఐకెన్’లో 100కు పైగా సంస్థలు భాగస్వాములు. అయితే, దాని నిర్వహణలో ఫిన్ ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ఇదివరకు నోబెల్ శాంతి బహుమతి పొందిన మలాలా యూసఫ్ జాయ్, బారక్ ఒబామా, హెన్రీకిసింజర్ వంటి వారు పలు సందర్భాల్లో ట్రంప్ అతివాదాన్ని తీవ్రంగా విమర్శించారు. అణ్వాయుధాల వినియోగం విధ్వంసకర పర్యవసానాలకు దారి తీస్తుందని, అందువల్ల ఒక అంతర్జాతీయ ఒప్పందం ద్వారా వాటి నిషేధంకోసం ’ఐకెన్’ పని చేస్తోందని 2017 నోబెల్ శాంతి బహుమతి కమిటీ పేర్కొంది.

అమెరికా అంతర్గత అంశాలు, విదేశీ వ్యవహారాలు, వాణిజ్యం తదితర అంశాలతోపాటు ఉత్తర కొరియా విషయంలో డొనాల్డ్ ట్రంప్ వైఖరి ఇంటా బయటా విమర్శలకు గురవుతోంది. ఈ నేపథ్యంలో నోబెల్ బహుమతి పొందిన సంస్థ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply