Read Time:1 Minute, 2 Second
-
మంత్రి మండలి సమావేశంలో సీఆర్డీయే ప్రదర్శన
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసుల అధికారులకోసం చేపట్టనున్న భవనాలకు సంబంధించి విభిన్నమైన నమూనాలు సిద్ధమయ్యాయి. మంగళవారం సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ నమూనాలను మంత్రుల ఎదుట ప్రదర్శించారు.
ఎవరెవరికి ఎంతెంత విస్తీర్ణంలో ఇళ్ళు నిర్మించాలన్న విషయమై ఇదివరకే ప్రమాణాలను నిర్దేశించుకున్నా… భవన నమూనాలు ఇంకా ఖరారు చేయవలసి ఉంది. ఈ నేపథ్యంలోసీఆర్డీయే అధికారులు మంగళవారం కేబినెట్ ఎదుట మొత్తం తొమ్మిది నమూనాలను ప్రదర్శించారు. ఆ నమూనాలను ఇక్కడ చూడొచ్చు.