కేఈ పెళ్ళి మళ్ళీ మళ్ళీ…!

  • మంత్రిమండలి సమావేశంలో సరదా సంభాషణ

రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సీరియస్ ఎజెండా మధ్యలో సరదా సంభాషణలూ సహజం. మంగళవారంనాటి మంత్రివర్గ సమావేశంలోనూ ఇలాంటి ఒక సందర్భం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి కెఇ క్రిష్టమూర్తి, ఆర్థిక శాఖ మంత్రి యనమల రామక్రిష్ణుడు మధ్య చోటు చేసుకుంది.

బలహీనవర్గాల యువతకు పెళ్ళి కానుకగా రూ. 30 వేలు ఇచ్చే అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు… ఆ మొత్తం సరిపోదని కెఇ అభిప్రాయపడ్డారు. దీనికి స్పందించిన యనమల ’కేఈ మళ్ళీ పెళ్ళి చేసుకుంటారేమో!’ అని చమత్కరించారు. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని ’ఆయనకంటే మీకే ఉత్సాహం ఎక్కువగా ఉన్నట్టుంది’ అని యనమలను ఉద్దేశించి సరదాగా వ్యాఖ్యానించారు.

Related posts

Leave a Comment